విశాఖలో జగన్నాధ స్వామి రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. రథంపై కొలువుదీరిన జగన్నాధుడిని ఊరేగించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఒరిస్సా సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన రథయాత్ర కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా నగర వాసులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంగా రాధాన్ని లాగుతూ జై జగన్నాధ అని నినాదాలు చేశారు. ఉమెన్స్ కళాశాల రోడ్డు నుండి ప్రారంభమైన రథయాత్ర… నగరంలోని ప్రధాన రహదారుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా రథయాత్ర నిర్వహించకపోవడంతో ఈసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.