బండి వ్యాఖ్యాలపై మండిపడ్డ జగదీష్ రెడ్డి

కృష్ణాజలాలపై బిజెపి నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పరిపక్వం తో కుడుకున్నవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకోవడంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. కృష్ణా నది జలాలపై బిజెపి నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆయన తీవ్రంగా స్పందించారు. అవగాహన రాహిత్యంతో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణ హక్కులు కేంద్రానికి ధారాదత్తం చేసినట్లు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల మద్యవిభేదాలు వస్తున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. నదిజలాలను వాడుకోవడంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్రంగా వివరించారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.కృష్ణానదిపై పూర్తి అనుమతులతోటే ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి నీళ్ల విషయంలో స్పష్టత అవసరమని,వృధానీటిని సద్వినియోగం చేసుకుందామని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారని ఆయన గుర్తుచేశారు. నీటి వినియోగం పై రాసిన వందలాది ఉత్తరాలకు కేంద్రం నుండి ప్రత్యుత్తరం రాలేదని ఆయన ఎద్దేవాచేశారు. కొత్తగా వచ్చిన బండి సంజయ్ కి నది జలాలమీద అవగాహన లేకనే యిలా మాట్లాడుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రాజకీయాలు మాని ప్రభుత్వ చర్యలకు ప్రతిపక్షాలు మద్దతు పలకాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపడకుంటే ప్రతిపక్షాలు ప్రజల దృష్టిలో దోషిగా నిలబడాల్సి వస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article