హరీష్ పై జగ్గారెడ్డి సంచలనం

Jagga Reddy Senastional comments on Harish

కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో కలకలం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలు అటు టిఆర్ఎస్ లోనూ, ఇటు కాంగ్రెస్లోనూ కలకలం రేపాయి.
ముందస్తు ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో, కాంగ్రెస్ నుండి సంగారెడ్డి ఎమ్మెల్యే గా గెలిచిన జగ్గారెడ్డి టీఆర్ఎస్ పైన సానుకూల దృష్టితో మాట్లాడుతున్నారు.. ఒకప్పుడు కెసిఆర్ అంటే ఫైర్ ఐన ఆయన ఇప్పుడు కేసీఆర్ తో తనకు ఎలాంటి పంచాయితీలు లేవని తేల్చి చెప్తున్నారు. అంతేకాదు కెసిఆర్ వల్లే తను ఎమ్మెల్యే కాగలిగాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అంతటితో ఊరుకోని జగ్గారెడ్డి హరీష్ రావు కంటే కేటిఆర్ ఫెయిర్ అంటూ కేటీఆర్ కు కితాబిచ్చారు. అంతేకాదు హరీష్ రావు మీద సంచలన ఆరోపణలు చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ హరీష్ రావు అని, గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి హరీష్ మంతనాలు చేశారని ఇప్పుడు ప్రస్తుతం కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి రాజకీయ దుమారం రేపారు జగ్గారెడ్డి.
కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన జగ్గారెడ్డి సొంత పార్టీని డిఫెన్స్ లో పడేసే వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమిపాలు కావడం వల్ల, ప్రతిపక్ష పార్టీ లో మరొక ఐదేళ్లు ఎమ్మెల్యే గా ఉండాల్సిన నేపథ్యంలో కేసీఆర్కు భయపడుతున్న జగ్గారెడ్డి మాట తీరును పూర్తిగా మార్చేశారు. కేటీఆర్ మీద, కెసిఆర్ మీద, టిఆర్ఎస్ పార్టీ మీద విమర్శలను పక్కనపెట్టి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 2004లో కెసిఆర్ టికెట్ ఇవ్వడం వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని చెప్పిన జగ్గారెడ్డి కేసీఆర్కు తనకు మధ్యలో ఎలాంటి గొడవలు లేవని తేల్చి చెబుతున్నారు. ఎటువంటి అసూయా ద్వేషాలకు తావులేదన్న ఆయన అన్న విమర్శిస్తే రాజకీయంగా విమర్శించే కానీ వ్యక్తిగత విమర్శలు చేయలేదు అంటూ జగ్గారెడ్డి చెప్పారు. లో మొదటి నుండి కేసీఆర్తో తనకెలాంటి విరోధం లేదని, హరీష్ రావు తో నే తనకు ఎప్పుడూ సమస్య ఉండేదని చెప్పిన ఆయన హరీష్ తన ఉనికి కోసం రాజకీయాల్లో తనను బలి చేసే ప్రయత్నం చేశారని అందుకే తనను జైలులో పెట్టించారని జగ్గారెడ్డి ఆరోపించారు. అంతేకాదు హరీష్ రావు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో దిట్ట అని చెప్పిన జగ్గారెడ్డి హరీష్ తో పోలిస్తే కేటీఆర్ చాలా ఫెయిర్ అంటూ కితాబిచ్చారు. కేవీపీతో గతంలో రాయబారం నడిపి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి హరీష్ ప్రయత్నించాడని చెప్పి సంచలన విషయాన్ని బయటపెట్టారు జగ్గారెడ్డి. ఇక ఇటీవల కూడా హరీష్ కాంగ్రెస్ లో చేరడానికి అలాంటి ప్రయత్నమే చేశారని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హరీష్ టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన క్రమంలో హరీష్ కు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఆయన అన్నారు ఇక తనకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదన్న జగ్గారెడ్డి సొంత పార్టీ పైన కూడా విమర్శలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ తప్ప తనను ఏ నాయకుడు కలవడానికి రాలేదని, తన గురించి పట్టించుకోలేదని చెప్పిన జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కమిటీలు, పదవుల్లో స్థానం కావాలంటే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ రాజకీయాలు చేయాలని వ్యాఖ్యానించారు. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7, 8 స్థానాల్లో గెలుస్తుందని చెప్పిన జగ్గారెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. కేసీఆర్ ను కేటీఆర్ ను పొగుడుతూ జగ్గారెడ్డి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకు తలనొప్పిగా తయారైంది. ఇక హరీష్ రావు విషయంలో పార్టీ మారాలని కాంగ్రెస్ తో మంతనాలు జరిపారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీలో అలజడి సృష్టిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ తో హరీష్ రావు మంతనాలు జరిపిన మాట వాస్తవమే అంటూ జగ్గారెడ్డి పేల్చిన బాంబ్ టిఆర్ఎస్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

Subscribe to YT|Tsnews.tv

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article