జగిత్యాల జిల్లా ఎండపల్లి లాక్డౌన్

56
Jagtial District Peddapalli Lockdown
Jagtial District Peddapalli Lockdown

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా వ్యాపారాలు మొదలయ్యాయి. మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు సైతం తెరుచుకుంటున్నాయి. ఐతే థర్డ్ వేవ్ వ్యాపిస్తోందన్న వార్తలతో గ్రామాలు అప్రమత్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపల్లిలో 2 రోజుల క్రితం కరోనాతో ఒకరు మృతి చెందడంతో పాటు, కేసుల సంఖ్య 12 కు పెరిగింది. దీంతో గ్రామ పెద్దలు అప్రమత్తం అయ్యారు. జూలై 19 వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వ తేదీ వరకు 10 రోజులపాటు లాక్డౌన్ విధిస్తూ ఎండపల్లి గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. ఉ. 7 గం. ల నుంచి 9 గం. ల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలనీ, తర్వాత మూసేయాలంటూ తీర్మానంలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణ యజమానులకు ₹ 5 వేల వరకు జరిమాన విధిస్తామని తెలిపారు. అలాగే గుంపులుగా తిరిగినా, మాస్క్ ధరించకపోయినా ₹ 1000 జరిమానా విధించాలని నిర్ణయించారు.

ఏఎన్ఎంలకు కరోనా రోగుల సమాచారం అందించిన తర్వాతే ఆర్ఎంపీలు వైద్యం చేయాలని కూడా తీర్మానించారు. సామాజిక దూరం పాటించాలనీ, గుంపులుగా తిరగొద్దనీ, మాస్క్ ధరించాలంటూ అవగాహన కల్పించేలా గ్రామంలో వాల్ పోస్టర్లను సైతం అతికించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here