అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండడంపై అభిమానులు ఎంత సంతోషంగా ఉన్నారో… ఆమె అంతకుమించి సంతోషంలో ఉంది. ఈ అవకాశంకోసం… ఎన్టీఆర్ సర్‌తో కలిసి నటించేందుకోసం
ఎప్పట్నుంచో కలలు కంటున్నానని చెప్పుకొచ్చిందామె. ఆ కల ఎట్టకేలకి నెరవేరడం ఎంతో తృప్తినిస్తోందని, సెట్లోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడదామా అని ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తున్నానని చెప్పింది జాన్వీ.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎవ్వరికీ తెలియదు కానీ…ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండునని దేవుడిని ఎన్నిసార్లో
ప్రార్థించానో లెక్కేలేదని, ఫైనల్లీ ఆ ఛాన్స్ వచ్చినందుకు ఎలాగైనా సద్వినియోగం చేసుకుంటానని సెలవిచ్చింది జాన్వి. “ప్రతి రోజూ ఈ సినిమా గురించి కలలు కంటున్నా.మా దర్శకుడు కొరటాల శివకి రోజూ మెసేజ్‌లు చేస్తున్నా. నేనేమైనా ప్రిపరేషన్ మొదలుపెట్టాలా? ఏం చేయాలి? అని అడుగుతున్నా.
ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి.ప్రేక్షకులకి ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుందీ సినిమా. చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నా. ఆర్.ఆర్.ఆర్ సినిమాని ఈమధ్య మళ్లీ చూశా. అందులో ఎన్టీఆర్ ఉత్సాహం ఆయన నటనలోని జోష్ నన్నెంతగానో ఆకట్టుకుంది“అని చెప్పుకొచ్చింది జాన్వి.