తమిళనాడులో జోరుగా సాగుతున్న జల్లికట్టు

Jallikattu game in Tamil Nadu

తమిళనాడులో సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించే సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పలు ప్రాంతాల్లో జల్లికట్టు జరుపుతున్నారు. జల్లికట్టు వేడుకలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే పుదుకొట్టేలో జల్లికట్టు ఉత్సవాల్లో అపశృతి దొర్లింది. ఎద్దులను అదుపు చేయడానికి యత్నించిన ఏడుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
సంక్రాంతి పండుగ సమయంలో తమిళ సంప్రదాయ సాహస క్రీడ అయిన జల్లికట్టు పోటీలను నిర్వహించడం ఆ రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వ అనుమతితో మొత్తం 64 ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోటీలు జరిపే బరులు ఉండాలని, పశువులను హింసించరాదని, వైద్యులు అందుబాటులో ఉండాలని పళనిస్వామి సర్కార్ ఆదేశించింది. జల్లికట్టులో పాల్గొనేందుకు 3400 మంది యువకులు పేర్లను నమోదు చేసుకోగా 2600 ఎద్దులు ఈ క్రీడలో పాల్గొంటున్నాయి. జల్లికట్టు నిర్వహణకు పేరున్న అవనియాపురంలో సంక్రాంతి రోజున, కానుం పొంగల్‌ రోజున పాలమేడులో, మూడో రోజున అలంగ నల్లూరులో ఈ పోటీలు యువతీ, యువకులు కేరింతల మధ్య ఆనందోత్సాలతో పోటీలు జరుగుతున్నాయి. అవనియపురం, పాలమేడు, అలంగ నల్లూరులో జరిగే జల్లికట్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల భారీగా ప్రేక్షకులు చేరుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article