‘జాంబిరెడ్డి’ఫ్రీ పబ్లిసిటీ కోసమేనా..?

89
jambireddy movie
jambireddy movie

jambireddy movie

ప్రశాంత్ వర్మ.. తెలుగులో ‘అఁ’అనే ప్రయోగాత్మక సినిమాతో ఆకట్టుకున్నాడు. కామన్ ఆడియన్ కు ఈ సినిమా అస్సలు అర్థం కాలేదు. కానీ మేకింగ్ పరంగా ఓ కొత్త ప్రయోగం అనిపించుకుంది. నాని నిర్మించిన ఈ మూవీకి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్ కూడా రావడం విశేషం. అటుపై రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా చేశాడు ప్రశాంత్ వర్మ. గరుడ వేగ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమా కావడంతో పాటు ట్రైలర్ కు అద్భుతమైన స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి. కట్ చేస్తే కల్కి వాటిని అందుకోవడంలో సక్సెస్ కాలేదు. అదే టైమ్ లో ‘అఁ’నేషనల్ అవార్డ్ విషయంలో ప్రశాంత్ చేసిన ఓ మిస్టేక్ తో పరిశ్రమలో చాలామంది వద్ద మైనస్ మార్కులు పడ్డాయి. మొత్తంగా కరోనా ప్రారంభం అయిన టైమ్ లోనే ఈ వైరస్ పై సినిమా చేస్తాను ప్రకటించాడు ప్రశాంత్. అన్నట్టుగానే ఓ సినిమా చేశాడు. కానీ అది పూర్తిగా కరోనా వైరస్ పై కానట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా ప్రకటించాడు. ‘జాంబిరెడ్డి’అనే టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. జాంబిరెడ్డి తెలుగులో మొదటి జాంబీ మూవీ అంటూ పోస్టర్ లో చెప్పాడు.

కానీ ఇదే తరహా ప్రకటనతో గతంలోనూ ఓ జాంబీ మూవీ వచ్చింది తెలుగులో. మొత్తంగా ఈ మోషన్ పోస్టర్ అయితే ఆకట్టుకునేలానే ఉంది. పోస్టర్ డిజైనింగ్ కూడా బానే ఉంది.  ఈ మూవీతో ప్రశాంత్ వర్మ సత్తా చాటాలనే ప్రయత్నంలో ఉన్నాడు. కాకపోతే జాంబిరెడ్డి అనే మాట ఆ వర్గంలో ఏమైనా మనోభావాల పంచాయితీ తెస్తుందా అనేది చెప్పలేం కానీ.. ఇప్పటి వరకూ తమ వర్గపు టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ హీరోయిక్ గా ఉన్నాయి. ఇప్పుడు తొలిసారిగా ఇలాంటి టైటిల్ వస్తుండటంతో ఆ క్యాస్ట్ నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తుందేమో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ టార్గెట్ కూడా ఇదే కావొచ్చా అనిపిస్తోంది. అంటే టైటిల్ నుంచి గొడవ మొదలైతే ఒద్దన్నా వచ్చేస్తుంది పబ్లిసిటీ. ఈ పబ్లిసిటీ కోసమే ప్రశాంత్ ఆ టైటిల్ ఎంచుకుని..  ప్రమోషన్ వచ్చిన తర్వాత తీరిగ్గా టైటిల్ మార్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏదేమైనా మొదటగా వచ్చిన తెలుగు జాంబీ మూవీ పత్తా లేదు. కానీ కాస్త తెలివైన వాడు అనిపించుకున్న ప్రశాంత్ అయినా పర్ఫెక్ట్ గా ఆ జానర్ ను హ్యాండిల్ చేస్తాడేమో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here