జామియా మిలియా కాల్పులపై ఫైర్ అయిన ఓవైసీ

jamia firing at caa protesters live debate aimim

దేశ వ్యాప్తంగా సీఏఏ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి . నేడు ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో విద్యార్థులు సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో  నిరసనకారులపై  ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపటం సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనపై  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై దాడి చెయ్యటం  పిరికి పంద చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాని పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి రోజున కాల్పుల ఘటన జరగటం దురదృష్టకరం అన్నారు. ఈ మేరకు ఒవైసీ ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ఇక ఓవైసీ చేఇన పోస్ట్ లో ‘ఉగ్రవాది గాడ్సే మహాత్మాగాంధీని హత్య చేయడాన్ని తాము గుర్తుచేసుకుంటున్న సందర్భంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఆ గాంధీకి నివాళులు అర్పించడానికి వెళుతున్నారు. ఇది పిరికిపంద చర్య. ఇటువంటి ఘటనలు మమ్మల్ని భయపెట్టవు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయి. ఈ పోరాటం గాడ్సేకు.. మహాత్మాగాంధీ, అంబేడ్కర్, నెహ్రూ కలలుకన్న భారత్ కు మధ్య పోరాటంగా మారింది. ఏ పక్షం వైపు ఉండాలన్నది తేలికగా మనం నిర్ణయించుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

jamia firing at caa protesters live debate aimim,CAA, NRC, protest , anti caa rally 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article