జూలై 3 న జనసేన భరోసా కార్యక్రమం

విజయవాడ:జనసేన భరోసా కార్యక్రమం విజయవాడ బందరు రోడ్డు మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జులై 3 వ తేదీన, జనవాణి కార్యక్రమం జరుగుతుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) తెలిపారు.తుమ్మలపాలెం లో మండల పార్టీ అధ్యక్షుడు పొలిశెట్టి తేజ గృహంలో మీడియాతో ఆయన మాట్లా డారు.తిరిగి తరువాత నాడు కూడా ఆదివారం ఉదయం 9 గంటలు నుండి 3 గంటలవరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నేరుగా శ్రీ పవన్ కల్యాణ్ గారికి విజ్ఞప్తి పత్రాలు అందచేయ వచ్చన్నారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొంటార న్నారు. మీ గ్రామాల్లో గాని కొండపల్లి మున్సిపాలిటీలో గాని, మీ పరిసరాల్లో సమస్యలు మీద గాని. థర్మల్ కేంద్రం పొల్యూషన్ మీద గాని, అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు విషయంలో, పెన్షన్లు విషయం లో గాని మీ ఆర్జీలకు ప్రభుత్వ అధికారులు స్పందించిక ఇబ్బందులు పడుతున్న వారికి జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పిటీషన్ లు ఇవ్వ వచ్చని తెలిపారు. ఆయన మీకు అండగా వుంటారని,మీరే స్వయానా కళ్యాణ్ గారికి అర్జీలు ఇవ్వండి త్వరలోనే మీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు, ప్రజలు ప్రభుత్వ అధికారులు తో గాని వైసీపీ నాయకులుతో గాని ఇబ్బందులు పడుతున్న వారికి ఇది మంచి అవకాశం అని తెలిపారు. ఎన్టీటిపిఎస్ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజలు సమస్యలు పరిష్కరించాలని, 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులు గా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అక్రిడేటెడ్ జర్నలిస్టుల ను ఆదాయపన్ను చెల్లించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయటం ఘోరమని అన్నారు.జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను ఇవ్వాలని, హెల్త్ కార్డులను, భీమా సదుపాయాలు కల్పించా లని ఆయన డిమాండ్ చేశారు.
మండల జనసేన అధ్యక్షుడు పొలిశెట్టి తేజాకృష్ణ, మాట్లాడు తుమ్మల పాలెం గ్రామంలోని కూలింగ్ కెనాల్ పై నిర్మించిన రెండు వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయని,వాటిని పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్నారు.కాలుష్యం తో పరిసర గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టి కి తీసుకు వెళతామని అన్నారు.ఈ కార్యక్రమంలో
జిల్లా మహిళా నేత లక్ష్మికుమారి, జనసేన పార్టీ గ్రామ కన్వీనర్ పవన్, వావర్డ్ నెంబర్ చిన్న స్వామి, వీర మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article