జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం పై రామ్ చరణ్ ఏమన్నారు అంటే

Jansen  Party election promotion, Ram charan Reaction

ఏపీ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించటానికి ప్రారంభించిన జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో తొలిసారి పోటీకి సిద్ధం అవుతోంది. ఇప్పటికే జనసేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటన చేసిన నేపధ్యంలో గట్టి పోటీ ఇస్తారా లేదా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ ఫైర్ బ్రాండ్ కోసం మెగా హీరోస్ ప్రచారం చేస్తారా అన్నది కూడా అందర్లోనూ ఉన్న ప్రశ్న.
ఇక ఏపీలోఆంధ్ర రాష్ట్రంలో మూడో రాజకీయ ప్రత్నామ్యాయం పవన్ స్థాపించిన “జనసేన” చుట్టూ ప్రస్తుత రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అని ప్రతీ ఒక్కరు కూడా అనుకుంటుండగా ఇదే జనసేన మరో ప్రజారాజ్యంగా మిగిలిపోతుంది అని అనే వాళ్ళు కూడా లేకపోలేరు.
అయితే పవన్ రాజకీయ పార్టీ పెట్టినా సరే కుటుంబం నుంచి అయితే సపోర్ట్ ని ఎప్పుడు కోరలేదు.అయితే రానున్న ఎన్నికల్లో ప్రచారం అనేది చాలా అవసరం.ఈ ప్రచారంకు గాను వారి కుటుంబానికి చెందిన ప్రముఖ హీరో రామ్ చరణ్ కొన్ని ఊహించని వ్యాఖ్యలు చేసారు.ఇటీవలే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున తాను పోటీ చేసే ఆలోచనలో అయితే లేనని తెలిపారు.కానీ పవన్ ఒక్క పిలుపు ఇచ్చినట్టయితే తాను ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తేల్చేసారు.ఇక పవన్ పిలుపునివ్వడమే తరువాయి,మరి పవన్ పిలుస్తారో లేదో చూడాలి. రాం చరణ్ , బన్నీ, వరుణ్ తేజ్, నాగబాబు , చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలున్న మెగా ఫ్యామిలీ నుండి పవన్ కోసం ప్రచారానికి వచ్చేదెవరో ..

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article