తెలంగాణాలోనూ జనసేనతో కలిసి బీజేపీ

199
Janasena BJP Alliance In Telangana
Janasena BJP Alliance In Telangana

Janasena BJP Alliance In Telangana

తెలంగాణా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో దొడ్డిదారిన విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. జనసేనతో తెలంగాణలో కూడా కలిసి పనిచేస్తామని, త్వరలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అవుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లో పవన్‌ కళ్యాణ్  సేవలు తీసుకుంటామని తెలిపారు. జనసేన-బీజేపీ కలిసి సీఎం కేసీఆర్‌ అవినీతి కుటుంబ పాలనను అంతమొందించుతామని ఆయన హెచ్చరించారు. మెజారిటీ లేని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ దొడ్డిదారిన ఛైర్మన్‌ పదవి చేజిక్కించుకుందని ఆరోపించారు. 100 సీట్లు గెలిచినా టీఆర్‌ఎస్‌కు తృప్తి లేదని, బీజేపీ గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా ఇలా చేయడం సరికాదన్నారు. తుక్కుగూడ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు లక్ష్మణ్ . నేడు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ  స్థానాలను దక్కించుకుంది. పలు చోట్ల ఘర్షణలు, గొడవల నడుమ ఎన్నిక కొనసాగింది.

Janasena BJP Alliance In Telangana,telangana, cm kcr, bjp state president, lakshman , janasena , pawan kalyan , municipal elections , tukkuguda, legal fight

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here