జీహెచ్ఎంసీలో జనసేన పోటి

205
JANASENA Contest In Ghmc
JANASENA Contest In Ghmc

JANASENA Contest In Ghmc

జనసేన పార్టీ డిసెంబరు 1 న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దీంతో, ఇప్పటివరకూ మిత్ర పార్టీలుగా ఉన్న జనసేన, టీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొనడం ఆసక్తిగా మారింది. మరి, ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఏదీఏమైనా జనసేన, బీజేపీలు కలిసి స్ట్రాటజిక్ గానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొంటున్నాయని సమాచారం. ఇప్పుడు తెలంగాణలో జనసేన తన ప్రాబల్యాన్ని పెంచుకునే అవకాశం లభించింది. దీంతో కేటీఆర్, పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందనే విషయంపై ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, 150 సీట్లలో జనసేన ఎన్నింట్లో పోటి చేస్తుంది? ఎవరెవరిని బరిలో నిలుపుతుంది? ఇందులో జర్నలిస్టులకూ అవకాశం ఇస్తుందా? గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుందా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Janasena Party Live

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here