బీజేపీ జనసేనల పొత్తు పొడిచింది

173
JanaSena join hands with BJP
Jana Sena join hands with BJP

JanaSena join hands with BJP

ఏపీ రాజకీయాల్లో  ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగారెండు పార్టీలూ 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కలిసి పోరాటం చేస్తామన్నారు. వైసీపీ నియంతృత్వ వైఖరిపై  పోరాటం సాగిస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తమతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకొచ్చారని అన్నారు. గతంలో టీడీపీ చేసిన అవినీతిపై కలిసి పోరాడతామని కన్నా ప్రకటించారు. ఎలాంటి షరతుల్లేకుండా తమతో కలిసి పనిచేయడానికి పెద్దమనసుతో పవన్‌ ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాజిక న్యాయం సాధించాలన్నా బీజేపీ-జనసేనతోనే సాధ్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ స్పష్టం చేశారు.  తాము అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న దృఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం నడుస్తుందని విమర్శించారు. ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. బీజేపీతో పొత్తు స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటుందని పవన్‌ చెప్పారు. ఏపీలో అవినీతిరహిత సుస్థిర పాలన అందించే లక్ష్యంతో పనిచేస్తామని పవన్‌ స్పష్టం చేశారు. బీజేపీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, దాన్ని సరిచేసుకున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. వామపక్షాల కంటే ముందే తాను బీజేపీతో కలిసి పనిచేశానని, వామపక్షాలకు తానేమీ బాకీలేనని ప్రకటించారు.

https://twitter.com/TSNEWSTV

Jana Sena join hands with BJP,andhra pradesh ,  janasena, 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here