జనసేన జోలికొస్తే క్రిమినల్ కేసులు…

101
janasena legal cell strong warning to opposition
janasena legal cell strong warning to opposition

janasena legal cell strong warning to opposition

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై , ముఖ్యనేతలపై విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్లను కోర్టుకు ఈడుస్తామని జనసేన లీగల్ సెల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన పార్టీ , పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ ఇనవ సాంబశివ ప్రతాప్ పేరుతో ఈ మేకు సంచలన ప్రకటన వెలువరించింది .
‘‘గతంలో జనసేన పార్టీలో ఉండి.. ఆపై ఇతర పార్టీలకు అమ్ముడుపోయి.. ఇప్పటికీ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ.. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు. జనసేన పార్టీని, విధానాలను, ముఖ్యనాయకులును, కార్యనిర్వాహకులను కించపరుస్తున్నారు. వీళ్ల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. పార్టీ సిద్ధాంతాలపై గౌరవం, చీఫ్ పవన్ కల్యాణ్ పట్ల కనీస అభిమానం లేనివాళ్లే ఈ తరహా వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు”అని జనసేన లీగల్ సెల్ ఆరోపించింది.గడిచిన రెండుమూడు రోజులుగా కొంతమంది వ్యక్తులు.. సోషల్ మీడియాలో లైవ్ వీడియోలు పెడుతూ పవన్ కల్యాణ్, జనసేనను తీవ్రంగా విమర్శిస్తున్నారని, పార్టీ సిద్ధాంతాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన లీగల్ సెల్ కోఆర్డినేటర్ ప్రతాప్ పేర్కొన్నారు.పవన్ పై, పార్టీపై తిట్లు కురిపిస్తూ, తప్పుడు ప్రచారానానికి పాల్పడుతోన్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశానికి సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టాం. ముందుగా లీగల్ నోలీసులు జారీచేసి, తదుపరి క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించాం అని ప్రకటనలో తెలిపారు.
janasena legal cell strong warning to opposition,janasena , pawan kalyan , criminal cases , serious warning, legal cell,ap politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here