జనసేనకు పుండుమీద కారం చల్లినట్టైంది

129
MLA RAPAKA KEYROLE IN YSRCP
MLA RAPAKA KEYROLE IN YSRCP

Janasena MLA Rapaka Attend CM Jagan Meeting In Rajahmundry

జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు అయినప్పటికీ ఆయన పవన్ కళ్యాణ్ కు షాకులు ఇస్తూనే ఉన్నారు.  ఈయన గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వెళుతూనే ఉన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ ఆకాంక్షలను పక్కనపెట్టి అసెంబ్లీ సాక్షిగా జగన్ కు జైకొట్టారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు మరోసారి షాకిచ్చారు రాపాక వరప్రసాద్..

దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కోసం రాజమండ్రికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో రాపాక సన్నిహితంగా మెలగడం జనసేన నేతలకు పుండుమీద కారం చల్లినట్టైంది. జగన్ ను రిసీవ్ చేసుకోవడం.. మర్యాదలు చేయడం.. మొత్తం ప్రొగ్రాంలో రాపాక సీఎంతోనే తిరగడం తో జనసేన నేతలే కాదు.. వైసీపీ నేతలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఖాతరు చేయకుండా ముందుకెళ్తున్న రాపాక పై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ హెచ్చరించారు. దీని పై హైపవర్ కమిటీలోనూ చర్చించారు. రాపాకకు బహిరంగ లేఖ రాసి వార్నింగ్ ఇచ్చారు. పవన్ ఇంత చేసినా కూడా మళ్లీ రాపాక.. జగన్ పర్యటనను అన్నీ తానై నిర్వహించడం చూసి జనసైనికులు షాక్ అవుతున్నారు.

Janasena MLA Rapaka Attend CM Jagan Meeting In Rajahmundry,Janasena, rapaka varaprasad, pawan kalyan, disha police stations, cm jagan  tour

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here