జగన్ నిర్ణయం చారిత్రాత్మకం అన్న జనసేన ఎమ్మెల్యే

115
Janasena MLA Supports Jagan Decision
Janasena MLA Supports Jagan Decision
Janasena MLA Supports Jagan Decision

జనసేన ఎమ్మెల్యే రాపాక మరోమారు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ప్రసంశలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. సోమవారం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ అంశంపై మాట్లాడిన రాపాక ఈ నిర్ణయం స్వాగతించదగిందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో రాష్ట్రంలో పేద దళితులు మరింత అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని రాపాక తెలిపారు. అలాగే దళితులను సామాజికంగా, ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్‌ అసెంబ్లీలో కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా ఇంతకుముందే ఇంగ్లీష్ విద్య విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు రాపాక.

ఈ విషయంలో రాపాక వైఖరిపై జనసేన అధిష్టానం గుర్రుగా ఉంది. పలుమార్లు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు రాపాక. గతంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల జనసేన అధిష్టానం పట్ల కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్ రాపాకకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదిలావుంటే రాపాక వరప్రసాద్ త్వరలో వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని మెప్పించేలా రాపాక మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

tags : Rapaka Varaprasad, Janasena Leader, Jagan Mohan Reddy, Jagan, SC ST Commission , AP Assembly

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here