జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గం

222
JanaSena Party Committees Announcement
JanaSena Party Committees Announcement

జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పవన్ నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు
. లీగల్ సెల్‌కి ప్రతాప్, డాక్టర్ సెల్‌కి రఘు, ఐటీ సెల్‌కి శివరాంలను నియమించారు. చేనేత సెల్‌కి సుభాష్, పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా కల్యాణపు శ్రీనివాస్‌లను నియమిస్తూ జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కందుల దుర్గేష్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా గోవింద్, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ, విజయవాడ అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్, కార్యదర్శిగా అమ్మిశెట్టి వాసులను నియమించారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్‌లను నియమించారు. అనంతపురం అధ్యక్షుడిగా పి.సి.వర్మ, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పసుపులేటి హరిప్రసాద్‌ లను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here