పవన్ వద్దన్నా, రాపాక 3 రాజధానులకు సై

159
Janasena Rapaka Supports Three Capitals Bill
Rapaka supports three capital bill

Rapaka supports three capital bill

జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా  నేడు అసెంబ్లీలో మూడు రాజధానులకు మద్దతు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే .ఒకపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చెప్తే అధినేత ఆదేశాన్ని ధిక్కరించి  ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ వేదికగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు అంశాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక ప్రసంగించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విశాఖపట్టణం ఎగ్జిక్యూటీవ్ రాజధాని అయితే వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఒకేచోట జరగడం సమంజసం కాదని, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రతీ దాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం భావ్యం కాదన్నారు. ప్రజాభిప్రాయం కూడా మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే రాపాక చెప్పుకొచ్చారు. జనసేన ఎమ్మెల్యే రాపాక రాజధాని అమరావతి విషయంలో  పవన్ కళ్యాణ్ తో విబేధించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక దీంతో రాపాకపై జనసేన క్రమశిక్షణా చర్య తీసుకుంటుందో లేదో వేచి చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here