జన‌వ‌రి 6 – 12 వార‌ఫ‌లాలు

January 6 -12 Horoscope

మేషరాశి : ఈ వారం చేపట్టు పనులను పూర్తిచేసేలా ప్రణాళిక కలిగి ఉండుట సూచన. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం మంచిది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. వారం ఆరంభంలో కాస్త చర్చలకు దూరంగా ఉండుట సూచన, ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ముఖ్యమైన విషయాల్లో వేచిచూసే ధోరణి మేలు. ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ఆశించిన మార్పులకు అవకాశం ఉంది. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులను కలుస్తారు.

వృషభరాశి : ఈ వారం నూతన ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. చర్చల్లో పాల్గొనకపోవడం మంచిది. ఆరంభంలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో బాగానే ఉన్న, అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులను కలుస్తారు, వారినుండి ముఖ్యమైన సమాచారం పొందుతారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూలమైన సమయం. గతంలో మీరు చేసిన పనుల వలన సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.

మిథునరాశి: ఈ వారం రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చర్చలో పాల్గొనే సమయంలో కాస్త ఆవేశాన్ని , కోపాన్ని తగ్గించుకోండి. అవతలి వారై ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నం చేయుట వలన తప్పక మేలుజరుగుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా అశ్రద్ధ చేయకండి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానపరమైన విషయాల కోసం ధనం ఖర్చుపెట్టవలసి వస్తుంది. జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు , సాధ్యమైనంత మేర సర్దుబాటు విధానం అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థరస్థి కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

కర్కాటకరాశి : ఈ వారం ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.మానసికంగా దృడంగా ఉండుట సూచన. సమయాన్ని వృధాచేయకండి. పెద్దలతో సమయం గడుపుతారు, వారి అనుభవం ఉపయోగపడుతుంది. వ్యాపారపరమైన విషయాల నిమిత్తమై పెద్దలను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను వేగంగా పూర్తిచేస్తారు, నూతన ప్రయత్నాల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది.

సింహరాశి : ఈ వారం ముఖ్యమైన పనులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. పెద్దలనుండి ఆశించిన సహకారం లభిస్తుంది. కాకపోతే పనులను పూర్తిచేయుటకు ఇబ్బంది తప్పక పోవచ్చును. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట మంచిది. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. స్నేహితులతో కాస్త గోప్యత పాటించుట వలన తప్పక మేలుజరుగుతుంది. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తలు తీనుకోండి , స్వల్పప్రమాద ఆస్కారం కలదు. లక్షీనృసింహ ఆరాధన మేలుచేస్తుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

కన్యారాశి : ఈ వారం స్నేహతులతో మీ ఆలోచలు పంచుకుంటారు , కాకపోతే వారినుండి వచ్చిన సహకారంతో మీరు సంతృప్తి పొందకపోవచ్చును. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి, ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోండి, సాధ్యమైనంత మేర వివాదాలకు దూరంగా ఉండుట సూచన. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. స్వల్పదూరప్రయాణాలు చేస్తారు. సోదరులతో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి. చిన్న చిన్న సర్దుబాట్లు మేలుచేస్తాయి.

తులారాశి: ఈ వారం సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుముఖం పడుతాయి. తండిఆరోగ్యం విషయంలో ఆందోళన తప్పకపోవచ్చును. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు, నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త సందిగ్దత ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు, మీ ఆలోచనలంతో వారిని ప్రభావితం చేసే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది.

వృశ్చికరాశి : ఈ వారం వాహనాలను లేదా స్థిరాస్తిని కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. దైవపరమైన విషయాలకు లేదా తీర్థయాత్రలకు సమయం ఇస్తారు. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, నూతన విషయాలు తెలుస్తాయి. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. ప్రయాణాలు చేయునపుడు ఇబ్బందులు తప్పకపోవచ్చును. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, తగ్గిసిన్చుకోనే ప్రయత్నం మంచిది. కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను మిత్రులు లేదా తోటివారితో కలిసి పూర్తిచేస్తారు. పెద్దలతో మీకున్న పరిచయం బలపడేలా ప్రణాళిక కలిగి ఉండుట మంచిది.

ధనస్సురాశి: ఈ వారం ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, ఆదరిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, ఎవరికైనా రుణపరమైన మాటఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. మిత్రులతో సమయం సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.

మకరరాశి : ఈ వారం మీ ఆలోచనలను తగ్గించుకోండి. ముఖ్యమైన నిర్ణయాల్లో కాస్త తడబాటు తప్పదు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్హలు వచ్చే అవకాశం ఉంది, కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. మానసికంగా ఇబబందులు అలాగే ఆందోళన పెరుగుతుంది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నలుగురిలో ఆశించిన మేర గుర్తింపు వచ్చిన సంతృప్తి ఉండకపోవచ్చును. ప్రయాణాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు. మీవైన ఆలోచనలను పెద్దలకు ఆపాదించే ప్రయత్నంలో విఫలం అవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.

కుంభరాశి : ఈ వారం బంధువులతో కలిసి శుభకార్యక్రమాలు జరుగుతాయి. వారినుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. మిత్రులతో ఆలోచనలు పంచుకుంటారు. కోపాన్ని తగ్గించుకోండి, కొన్ని కొన్ని వివాదాలకు మీరే కారణం అయ్యే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే ఆస్కారం కలదు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. కుటుంబ పరమైన విషయాల్లో సర్దుబాటు మంచిది. రావాల్సిన ధనం కోసం కాస్త గట్టిగా ప్రయత్నం చేయుట మంచిది.

మీనరాశి : ఈ వారం విదేశాల్లో ఉన్న మిత్రులనుడి సహకారం లభిస్తుంది. చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. మీవైన ఆలోచనలతో ఆకట్టుకుంటారు. ఆరోగ్యం సమస్యలు తగ్గుట వలన కొంత నూతన ఉత్సాహం పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. బంధువులతో వివాదాలు రాకుండా సర్దుబాటు విధానం మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసమా చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి, అనుకూలమైన ఫలితాలు ఒపొందుతారు. పెద్దలనుండి సహకారం లభిస్తుంది. ఆత్మీయుల నుండి సహకారం పొందుతారు. గతంలో ఆగిన పని ముందుకు వెళ్తుంది.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్ (మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం), ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం) మాస్టర్స్ ఇన్ వాస్తు, పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం. పిహెచ్డి (వేదాంగజ్యోతిషం), (ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article