జయరాం కేసు మళ్ళీ మొదటికి … శిఖానే సూత్రధారి అంటున్న జయరాం భార్య

JAYARAM CASE AGAIN STARTED

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం కేసు మళ్లీ మెుదటికి వచ్చింది. జయరాం హత్య కేసును తెలంగాణ పోలీసులు మెుదటి నుంచి విచారణ చేపట్టారు. జయరాం హత్యకేసు విచారణలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని ఆయన భార్య పద్మశ్రీ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు విచారణ చేపట్టిన తెలంగాణ పోలీసులు జయరాం ఇంట్లో అతని భార్య పద్మశ్రీని విచారించారు. బంజారాహిల్స్ లో సుమారు రెండు గంటలపాటు న్యాయవాదుల సమక్షంలో ఏసీపీ కేఎస్ రావు విచారించారు. ఈ సందర్భంగా జయరాం హత్యపై పద్మశ్రీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది.
అంతేకాదు అందుకు గల కారణాలను కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పద్మశ్రీ స్టేట్ మెంట్ ని రికార్డు చేశారు. అనంతరం కంపెనీలకు సంబంధించి పలు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తన భర్త హత్యలో కుట్ర ఉంది అని అందుకు శిఖాచౌదరియే కారణమంటూ ఆరోపించారు. ఈ హత్యలో సూత్రధారి శిఖా చౌదరి అని, రాకేష్ రెడ్డి కేవలం పాత్ర ధారి అంటూ ఆమె ఆరోపించారు. తన భర్త ఉమెనైజర్ అంటూ శిఖాచౌదరి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కేసును లోతుగా విచారించాలని ఆమె పోలీసులను కోరింది. మరోవైపు తన భర్త హత్య కేసులో ఏపీ ప్రభుత్వం చేయని న్యాయం తెలంగాణ ప్రభుత్వం చేయాలని పద్మశ్రీ కోరారు. హత్యతో శిఖాచౌదరికి సంబంధం లేదని ఏపీ పోలీసులు తేల్చడం అన్యాయమని వాపోయారు. విచారణలో పోలీసులు ప్రలోభాలకు లొంగి ఉండొచ్చని పద్మశ్రీ అనుమానం వ్యక్తం చేశారు.
తన భర్త హత్యకు శిఖాచౌదరియే కీలకమని ఆరోపించిన ఆమె పోలీసులు మాత్రం ఆమెను వదిలేసి రాకేశ్‌రెడ్డిపై కేసు రుద్దారని ఆరోపించారు. జయరామ్‌ హత్య కేసులో విచారణ ఇంకా లోతుగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
జయరామ్ మరణించినట్లు తెలియగానే శిఖాచౌదరి తమతో సంబంధం లేని వ్యక్తులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదన్నారు. 2014 నుంచి శిఖాచౌదరి తమ కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో తలదూరుస్తోందని మండిపడ్డారు. రాకేశ్‌ రెడ్డి ఎవరో తమకు తెలియదని, తన భర్త అతడి వద్ద అప్పు తీసుకునే అవకాశమేలేదన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article