జయరామ్ కేసు తెలంగాణా పోలీసులకు బదిలీ….ఏపీ పోలీసుల కీలక నిర్ణయం

JAYARAM CASE TRANSFERED TO TS POLICE

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ వీడటం లేదు. కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జయరాం హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని…తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని జయరాం భార్య పద్మశ్రీ అన్నారు. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో జయరాం హత్య కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించారు. వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్లు ఏపీ పోలీసులు తెలిపారు. మరోవైపు జయరాం హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఫిభ్రవరి6 బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఫిభ్రవరి 22వ తేదీ వరకు జడ్జీ నిందితులకు రిమాండ్ విధించారు.
జయరామ్‌ హత్య కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ ఆయన భార్య చిగురుపాటి పద్మశ్రీ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. తన భర్తకు విషమిచ్చారని తొలుత అన్నారని, ఆ తర్వాత కొట్టారని, ఇంకోసారి బీరుసీసా కథ అల్లారని.. ఇలా ఏపీ పోలీసులు రోజుకో డ్రామాతో కేసును నీరుగార్చారని మండిపడ్డారు. తన భర్త పోస్టుమార్టం నివేదిక కావాలని గత నాలుగు రోజులుగా నందిగామ పోలీసులను కోరుతున్నా.. ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఈ హత్య జరిగినందున, ఇక్కడి పోలీసులే దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. హత్య హైదరాబాద్‌లో జరిగితే కేసును ఏపీలో దర్యాప్తు చేయడమేంటో తనకు అర్థం కావడం లేదన్నారు. అందుకే తనకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు.
ఈ హత్య కేసులో తన భర్త మేనకోడలు శిఖాచౌదరి పాత్ర ఉన్నా, కొంతమంది వ్యక్తులు ఆమెను తప్పించారని ఆరోపించారు. తన భర్త హత్య కేసులో తెలంగాణ పోలీసుల దర్యాప్తుతోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నానని స్పష్టం చేశారు. మేనమామ చనిపోయాడని తెలిస్తే శిఖాచౌదరి ఘటనాస్థలికి వెళ్లకుండా తమ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి బీరువాలోని విలువైన పత్రాలు తీసుకెళ్లడమే అనుమానాలకు తావిస్తోందని పద్మశ్రీ పేర్కొన్నారు. కేసు నుంచి శిఖా చౌదరిని తప్పించేందుకు ఏపీలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article