జయరామ్ ను హతమార్చింది శిఖా బాయ్ ఫ్రెండ్ రాకేష్

JayaRam Was Killed by Sikha Boy Friend Rajesh … ఎందుకంటే

ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ మర్డర్ మిస్టరీ లో జయరాం ను హత్య చేసింది శిఖా చౌదరి ప్రేమించిన రాకేష్అని తేలిపోయింది. అయితే రాకేష్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డాడా లేక రాకేష్ కు ఎవరైనా సహకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడకు తీసుకెళ్లి..కారులోనే హత్య చేసి నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారి పక్కనే కారును వదిలేసి పరారయ్యారు. ఏదో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ..రాకేష్ ఒక్కడే కలిసి హత్య చేయడని అనుమానిస్తున్న పోలీసులు ఇతర విషయాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే చిగురుపాటి సతీమణి మీడియా ఎదుట రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి వద్ద జయరాం రూ. 4.5 కోట్లు అప్పు తీసుకున్నారు. దీనికి సంబంధించిన విభేదాల కారణంగా రాకేశ్ రెడ్డి ఆయనను చంపినట్లు సమాచారం.జయరాంను హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళుతూ కారులోనే రాకేశ్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కారు వెనుక సీట్లోనే కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. మద్యం మత్తులో ఉండగానే హత్య చేసి దీనిని ప్రమాదంగా చిత్రీకరించి ఐతవరం వద్ద రోడ్డు పక్కన కారును వదిలి రాకేశ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.
మాదాపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి రాకేశ్ రెడ్డి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ హత్యలో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి పాత్ర ఉందా లేదా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాకేశ్‌రెడ్డి.. శిఖా చౌదరికి బాయ్‌ఫ్రెండ్ అతని వద్ద నుంచి ఆమె రూ.4.5 కోట్లు అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య రుణం విషయమై గత కొంతకాలంగా గొడవ జరుగుతూ వస్తోంది. ఈ సందర్భంలోనే మేనకోడలి డబ్బును తాను చెల్లిస్తానని చిగురుపాటి సెటిల్‌మెంట్ చేశాడని తెలుస్తోంది.డబ్బు తీసుకుంది శిఖా చౌదరి.. అప్పు తీర్చాల్సింది కూడా ఆమె. అలాంటప్పుడు శిఖా చౌదరిని వదిలిపెట్టి జయరామ్‌ను రాకేశ్ రెడ్డి ఎందుకు చంపాడన్నది అంతుచిక్కని ప్రశ్న. నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఉన్న శిఖా చౌదరిని కలవడానికి కబాలి చిత్ర నిర్మాత కెపి చౌదరి ఎందుకొచ్చాడు.
శిఖా చౌదరి తల్లి సుశీలను పీఎస్‌కు ఎందుకు పిలిపించారు… ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శిఖాను ఈ కేసు నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.చిగురుపాటి జయరామ్‌కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ శిఖా చౌదరి కనుసన్నల్లోనే ఉండటం ఇంకా ఆమె పోలీసుల అదుపులోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article