జగన్ తెలివైన వాడు .. రాష్ట్రంలో భస్మాసురుడు : జేసీ

158
jc hot comments
jc hot comments

jc hot comments

ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన జేసీ ఇంటరెస్టింగ్ కామెంట్స్‌ చేశారు. ఏపీ సీఎం జగన్ చాలా తెలివైనవాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి, ఇక  పోలీసులు ఉంటే సరిపోతుందంటూ జగన్ తీరును జేసీ ఎండగట్టారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని, ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం స్వాగతించదగ్గ నిర్ణయమేనని పేర్కొన్న జేసీ అందువల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. తాను టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని చెప్పారు.  ప్రతి ఒక్కరికీ సమాజిక వర్గం ఉంటుందని, అది లేని వారు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి జగన్ పై నర్మ గర్భంగా వ్యాఖ్యలు  చేశారు  జేసీ దివాకర్ రెడ్డి .

ap politics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here