జేడీకు ఆ పార్టీ నుండి ఆహ్వానం…

JD Laxmi Narayana to join Aam Aadmi Party

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారనే ఆసక్తి సర్వత్రా కలుగుతుంది . తన జీవితం పూర్తిగా ప్రజాసేవకే అంకితమని భావించి పోలీస్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి  వచ్చిన జేడీ జనసేనలో ఇమడలేకపోయారు. పవన్ నిలకడలేని విధానాలకు వెరిసి బయటకొచ్చారు. సీబీఐ మాజీ జేడీ ఏ పార్టీలో చేరుతారనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో తాను ఇక రైతుల సేవలోకి వెళ్తున్నానని జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. అలాగే కొత్త పార్టీని వెతుక్కున్నట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీని చిత్తు చేసిన కేజ్రీవాల్ సమరోత్సాహంతో ఉన్నారు. ఆయన విజయం యువతరానికి కొత్త నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇదే ఊపులో కేజ్రీవాల్ తన పార్టీ ‘ఆమ్ ఆద్మీ’ని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారట.. దేశవ్యాప్తంగా ఆప్ పై ప్రజల్లో ఉన్న క్రేజ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడట..ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీని ఆంధ్రప్రదేశ్ లోనూ విస్తరించాలని కేజ్రీవాల్ యోచిస్తున్నట్టు తెలిసింది. ఆమ్ ఆద్మీ ఏపీ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా జేడీ లక్ష్మీనారాయణను ఆహ్వానించినట్టు సమాచారం.  దీంతో సొంతంగా ఎదుగాలని.. తన సత్తా చూపుదామని చూస్తున్న లక్ష్మీనారాయణకు ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో ఓ మంచి అవకాశం దక్కిందని.. ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని అంటున్నారు.  చూడాలి మరి లక్ష్మీ నారాయణ ఏం చేస్తారో !!

JD Laxmi Narayana to join Aam Aadmi Party,cbi former JD , Lakshmi narayana , janasena , aam admi, aap , delhi

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article