ఇచ్చింది పసుపుబోర్డు కాదు..పాచిపోయిన అన్నం

110
TRS MLA Jeevan Reddy fires On MP Aravind Over Turmeric
TRS MLA Jeevan Reddy fires On MP Aravind Over Turmeric

jeevan reddy fires on central termiric new board

కేంద్రం పసుపు బోర్డు ఇవ్వలేదని, నిజామాబాద్ రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి . కేవలం  స్పైసెస్‌ బోర్డు రీజినల్ ఆఫీస్‌ మాత్రమే ఇచ్చిందన్నారు.  పీయూసీ  చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి. రీజినల్ ఆఫీస్‌లు ఇప్పటికే ఆరున్నాయని గుర్తు చేశారు. ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్‌వి నకిలీ మాటలన్నారు. కేంద్రం  బిర్యానీ పెడుతుంది అనుకుంటే పాచిపోయిన అన్నాన్ని నిజామాబాద్‌ రైతులకు వడ్డిస్తోందని విమర్శించారు. మాజీ ఎంపీ కవిత కూడా పసుపు బోర్డు కోసం తీవ్రంగా కృషి చేశారన్నారు జీవన్‌ రెడ్డి. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేయాల్సిందంతా చేశారని.. పసుపు బోర్డు కేంద్రం పరిధిలోని అంశమని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందన్నారు.

jeevan reddy fires on central termiric new board,trs party

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here