25 ఎకరాల్లో కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఎందుకు?

121
Jeevan Reddy Fires On KTR, KCR Over Farmhouse
Jeevan Reddy Fires On KTR, KCR Over Farmhouse

Jeevan Reddy Fires On KTR, KCR Over Farmhouse

తెలంగాణ మంత్రి కె తారకరామారావుపై మరోసారి ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నేడు ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ…111 జివో నిబంధనలకు విరుద్ధంగా 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ ల నిర్మాణం టీఆరెస్ నాయకులు చేపట్టారని ఆరోపించారు. కేటీఆర్ తన విలాసవంతమైన జీవనం కోసం 111 జీవోను ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఉల్లంఘనలను బయటపెట్టినందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డ ఆయన అసలు దొంగలను పట్టుకోవడం మానేసి ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. 111 జివోను కాపాడాల్సిన కేటీఆర్ స్వయంగా ఆయనే ఉల్లంగిస్తున్నారు. ఫామ్ హౌస్ కేటీఆర్ ది కాదు..కానీ ఆయన కొన్ని ఏండ్లుగా వాడుకుంటున్నారు అని బాల్కసుమన్ చెప్పారు. అయితే కేసీఆర్ కి ఎర్రవల్లిలో ఫామ్ హౌస్- కేటీఆర్ కి జన్వాడ లో ఫామ్ హౌస్ ఎందుకంటూ మండిపడ్డారు జీవన్ రెడ్డి.  25 ఎకరాల్లో కేటీఆర్ కి ఫామ్ హౌస్ ఎందుకు.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ పోయాయి?. సుప్రీంకోర్టు కోర్టు గైడ్ లైన్ ఉన్నా రేవంత్ అరెస్ట్ న్యాయబద్ధమైనది కాదని టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టారు. 111 జివో తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతుందా లేదా?, అక్రమ నిర్మాణం కి పాల్పడ్డ వారికి కపలా ఉన్న కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో 111జివో అమలు వెంటనే చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  కేటీఆర్ పై 111జివో ఉల్లంఘన పై చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అరెస్టు ను తీవ్రంగా కండించారు జీవన్ రెడ్డి.

Jeevan Reddy Fires On KTR, KCR Over Farmhouse,KTR Farmhouse Issue,Jeevan Reddy Fires On Revanth Arrest,KCR Farmhouse,25 acres farmhouse, GO 111,Telangana Political Updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here