కేటీఆర్ కు మున్సిపల్ మంత్రిగా అర్హత ఉందా…

137
jeevan reddy fires on KTR
jeevan reddy fires on KTR

jeevan reddy fires on KTR Over Illigal Constructions

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  ఫ్లెక్సీలు ఏర్పాటుతో పర్యావరణం కలుషితం అవుతోందని ఇక పర్యావరణ పరిరక్షణకు మంత్రి కేటీఆర్ చూపిస్తున్న శ్రద్దకు మెచ్చుకున్తున్నానన్న ఆయన పార్టీలో ఉన్న నేతలు ఫ్లెక్సీలు కడితే ఏ విధంగా ఫైన్ వేస్తున్నారో మరి కేటీఆర్ నిర్మించే అక్రమ నిర్మాణ కట్టడాలకు ఏ విధమైన ఫైన్ వేయాలి అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి . ఇక అక్రమ నిర్మాణాలకు పాల్పడే కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా పదవిలో కొనసాగే అర్హత కేటీఆర్‌కు ఏ మాత్రం లేదని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.  ప్రజలకు, ప్రజాప్రతినిధులకు చట్టాలు గుర్తుచేసే మంత్రి కేటీఆర్.. ఒకసారి తాను చేస్తున్న పనులను ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవుపలికారు.

అక్రమ నిర్మాణాలు తొలగించాలని నిరసనలు చేసిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 111 జీవో నిర్వీర్యం చేసి అక్రమ నిర్మాణాలపై కూడా కేటీఆర్ స్పందిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు కేటీఆర్ వి కావు కేవలం లీజు హోల్డర్ మాత్రమే అని విప్ బాల్క సుమన్ అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు  జీవన్ రెడ్డి.. చట్టాలని ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే నీకు ఏ విధమైన పెనాల్టీ వేయాలి? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలు జీవించడం లేదన్నారు జీవన్ రెడ్డి.. లక్షల మంది నిరుద్యోగ యువత.. ఉద్యోగాలు లేక విలవిలలాడుతున్నారు… వారి కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు జీవన్ రెడ్డి . ఇందుకేనా తెలంగాణ రాష్ట్రం కావాలన్నది అంటూ ప్రశ్నించారు. 111 జీవో పరిధిలో పేదలు ఇల్లు నిర్మించుకుంటే అడ్డు వచ్చే జీవో మీ ఫార్మ్ హౌజ్ నిర్మిస్తే అడ్డు రాదా అని ఫైర్ అయ్యారు.

jeevan reddy fires on KTR Over Illigal Constructions,congress leader , mlc jeevan reddy  , illegal constructions , municipal minister , revanth reddy , konda vishweshwar reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here