జీవిత రాజశేఖర్ ఇంటిని ముట్టడిస్తాం

జీవిత రాజశేఖర్ ఇంటిని ముట్టడిస్తాం
తక్షణమే వైశ్యులకు క్షమాపణ చెప్పాలి-కాచం సత్యనారాయణ
హైదరాబాద్: సినీ నటి, జీవిత రాజశేఖర్ ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా వైశ్య కులాన్ని దూషించే విధంగా హాస్యాస్పదంగా, వ్యంగ్యంగా కోమటి దాని లెక్క అంటూ వ్యాఖ్యలు చేసినందుకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో వైశ్య వికాస వేదిక చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన జీవిత రాజశేఖర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆర్య వైశ్య సంఘాలు డిమాండ్ చేశాయి. లేనియెడల ఆ సినీ నటి ఇంటిని ముట్టడిస్తామని సంఘాలు హెచ్చరించాయి. బాధ్యురాలిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను వైశ్య సంఘాలు కోరాయి.

1. కాచం సత్యనారాయణ గుప్త-వైశ్య వికాస వేదిక చైర్మన్.

2. మొగుళ్లపల్లిఉపేందర్గుప్త-ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article