Jersey Movie was Inspiration
నేచురల్ స్టార్ నాని కథానాయకుడుగా రూపొందుతోన్న చిత్రం `జెర్సీ`. `మళ్ళీరావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ రీసెంట్‌గా రిలీజై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. టీజర్ చూస్తే 36 ఏళ్ల వ్యక్తి ఇండియన్ క్రికెట్ టీమ్‌లో చోటు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం.. ఆ క్రమంలో జరిగే పరిస్థితులు, ఎమోషన్స్ ఆధారంగా సినిమా నడుస్తుంది. ఇది వింటుంటే హాలీవుడ్ చిత్రం ఇన్విన్సిబుల్ సినిమాలా అనిపిస్తుంది. ఆ సినిమాలో కూడా హీరో అక్కడి ఫుట్ బాల్ టీమ్‌లో చోటు కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ సినిమా కథను తయారు చేసుకున్నారా? అనిపిస్తుంది. ఈ విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!. నాని జతగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.