యేసయ్యా నీ మాట‌లే నిత్య‌జీవ‌ము..

Jesus words are everlasting life

” అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతలు 8:34

– అవును…. దేవుని మాటలు వినుటకు అయన గుమ్మము దగ్గర కాచుకొని, ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అని అశాతో కనిపెట్టువారు ధన్యులు.

నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. కీర్తనలు 119:18

– ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ పరిశుద్ధ గ్రంధము అని పిలువబడేది బైబిల్ ఒక్కటే.
– అట్లాంటి గ్రంధాన్ని ఒక సామాన్యమైన పుస్తకమువలె, న్యూస్ పేపర్ లా చదివితే అర్ధం కాదు.
– ఈ లోకంలో ఎంత విద్య అభ్యసించినా? ఎన్ని డిగ్రీలు తీసుకున్నా,
– ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంధాన్ని అర్ధం చేసుకోవడానికి ఏమాత్రం సరిపోదు.

మన మనో నేత్రాలు తెరువబడితేనే గాని, పరిశుద్ధ గ్రంథములోని ఆశర్యకరమైన సంగతులను గ్రహించలేము.

* అదెట్లా సాధ్యం?
* పరిశుద్ధ గ్రంధములో ఏముందో?
▪ తెలుసుకోవాలనే తృష్ణ కలిగి యుండాలి.
▪ తెలుసు కోవడానికి పరిశుద్ధాత్ముని సహాయం కొరకు ప్రార్ధించాలి.

అప్పుడు మనో నేత్రములు తెరువబడి, ఆశర్య కరమైన సంగతులను చూడగలము.

* ఇంతకీ, పరిశుద్ధ గ్రంధంలో ఏముంది?

▪ ఆయన పిలుపు
▪ దాని నిరీక్షణ
▪ పరిశుద్ధులకు స్వాస్థ్యము
▪ ఆయన మహిమైశ్వర్యము
▪ ఆయన బలము
▪ ఆయన అపరిమితమైన శక్తి
▪ ఆయన మాహాత్మ్యము

* ఇవి కొన్ని మాత్రమే.

పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే లెక్కకు మించిన సంగతులు నీకు బోధించబడతాయి.

మీ మనో నేత్రములు వెలిగింప బడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరి మితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎఫెసీ 1:17-19

* అయితే, పరిశుద్ధ గ్రంధములో ఈ విషయాలు మనకెందుకు అర్ధంకావట్లేదు? సమాధానం ఒక్కటే.
– దావీదు వలే అట్లాంటి తృష్ణ మనకులేదు.
– అట్లా ప్రార్ధించిన సందర్భమూ లేదు.

– అందుకే, దివ్య గ్రంథములోని దివ్యమైన సంగతులు మనము తెలుసుకోలేక పోతున్నాము.
అసలు తెలుసుకోలేని మనము వాటిని ఇంకెక్కడ అనుసరించగలము? సాధ్యం కానేకాదు.
– దావీదువలే నాట్యం చేస్తాను అని పాడే నీవు,ఆయన కలిగిన తృష్ణను కలిగియుండు.ఆయనలా ప్రార్ధించు.

* ఏందుకు దేవుని మాటలు వినాలి?

* యేసయ్యా మాటలు సమృద్ధినిస్తుంది
నా ఉపదేశము వానవలె కురియును నా వాక్యము మంచువలెను లేతగడ్డిమీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును.
ద్వితి 32:2

– దేవుడు ఏ ఉద్దేశ్యముతో మంచునూ, వర్షమునూ కురిపిస్తున్నాడో అవి, దేవుని ఉద్దేశ్యమును చక్కగా నెరవేర్చితున్నాయి.

– వర్షము, మంచు ఆకాశము నుండి వచ్చి, భూమిని తడుపుతాయి.
– దాని నుండి మొక్కలు మొలిపించేలా చేసి, చల్లడానికి విత్తనాలను, తినడానికి ఆహారాన్ని యిస్తాయి. అలా చేస్తేనే తప్ప, ఆకాశానికి తిరిగిపోవు. అట్లానే, దేవుని వాక్కులు ఆయన నోట నుండి, ఆయన ప్రవక్తల నోటనుండి వచ్చి, అక్కడ నుండి లోకములో దేవుని సంకల్పాలను నేరవేర్చడానికి బయలుదేరాయి.అవి నిష్ఫలముగా దేవుని దగ్గరకు తిరిగి చేరవు. దేవుని యొక్క సంకల్పాన్ని తప్పక సాధిస్తాయి.

వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును యెషయా 55:10

– దేవుడు ఒక మాట చెప్పాడంటే?
– అది తప్పక జరిగి తీరుతుంది.
– అందుకే, జరుగవలసిన కొన్ని విషయాలుకూడా, జరిగిపోయినట్లు పరిశుద్ధ గ్రంధములో వ్రాయబడ్డాయి. అంటే?
దేవుని మాటలు అంత ఖాయమన్న మాట.

– అయితే, దేవుడు ఏమి చెప్పాడో మనకు తెలియాలంటే?

పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ఒక్కటే మార్గం.
ఈ సత్యాన్ని గ్రహించి, పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించగలిగితే?
– ఆ వాక్యము నెమ్మదినిస్తుంది!
– ఆశీర్వాదాన్నిస్తుంది!
– శాశ్వతమైన సంతోషాన్నిస్తుంది!
– నీ జీవితాన్ని వెలిగిస్తుంది!
– ఆదరిస్తుంది!
– ప్రోత్సహిస్తుంది!
– జీవింపజేస్తుంది!
– నిత్యరాజ్యానికి చేర్చ గలుగుతుంది.

ఈ లోకంలో ఎన్ని గ్రంధాలున్ననూ ఆ దివ్య గ్రంధానికి సాటిరావెన్నడు.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం! అట్టి రీతిగా జీవిద్దాం!
” అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. సామెతలు 8:34

అవును…. దేవుని మాటలు వినుటకు అయన గుమ్మము దగ్గర కాచుకొని కనిపెట్టువారు ధన్యులు.

* ఎందుకంటే?
– “యెహోవా ఉపదేశములు…. తేనేకంటెను జుంటితేనె ధారాలకంటేను మధురమైనవి.” (కీర్తన 19:10)
“ ఒక పౌను బరువుండే తేనెను సేకరించడానికి… ఒక తేనెటీగ అక్షరాలా లక్ష కిలోమీటర్లు ప్రయాణము చేయవలసి ఉంటుంది.
– ఈ ప్రయాణంలో దాదాపు 2 లక్షల పూవులను సెలెక్టు చేసుకొని మకరంధాన్ని సేకరిస్తేనే కాని ఒక పౌను తేనెను ఒక తేనెటీగ సేకరించలేదు. మరి అయితే
– “యెహోవా ఉపదేశములు…. తేనేకంటెను జుంటితేనె ధారాలకంటేను మధురమైనవి.” (కీర్తన 19:10) అని భక్తుడు అంటున్న
– ఆ తీయని వాక్యము కొరకు నీవెంత ప్రయాసపడుచున్నావు.
– మంచి వాక్యము కొరకు ఎంత దూరము వెళ్తున్నావు?
– కనీసం నీ ఇంట్లో ఉన్న జీవ గ్రంథాన్ని రోజు కొక్కసారైనా జుర్రుకుంటున్నావా?
– ఈ తేనెటీగను చూసైనా పాఠం నేర్చుకుందాం.
– మీరు బైబిల్ ను కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా చదివి, మీ ఆత్మీయతను పెంపొందిచుకొనుటకు దీవెనకరంగా ఉంటుందని ఆశీస్తూ, ప్రార్ధిస్తున్నాను.
– ఇప్పుడు దేవుని వాక్యాము
చాలామంది కి అందుబాటులో ఉంది మరి చదవడానికి సమయం ఇస్తున్నారా?

యేసయ్యా మాటలు నిత్యజీవపు మాటలు.
– అవి బ్రతికిస్తాయి,
– ఈ లోకంలో ఏలా బ్రతకాలో నేర్పిస్తాయి….
– బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అనుగ్రహిస్తాయి.

గమనించండి….
ఏనాడు ఏ నాయకుడు మాటలాడని మాటలు మన రక్షకుడైన యేసుక్రీస్తు మాట్లడగా విని సీమెను పేతురు ఇలా అన్నడు.
” ప్రభువా…. ఎవని వద్దకు వేళ్ళుదుము నీవే నిత్యజీవపు మాటలుగలవాడవు నీవే దేవుని పరిశుధ్ధుడవని మేము విశ్వసించియున్నము” అని. అవును….

యేసయ్య మాటలు నిత్యజీవం గలవి,
“తండ్రీ వీరు ఏమి చేవుచున్నరో విరేరుగరు గనుక వీరిని క్షేమించుడి”
– అని యేసయ్య సిలువలో పలికిన మాటలు ప్రపంచాన్నే ఆలోచింపచేశాయి;
– పగ, ప్రతీకారం అనే మాటలను తుడిచివేయటం ప్రారంభించాయి.
– సరికోత్త నూతన ప్రపంచానికి శ్రీకారం చుట్టాయి.
– అలాంటి యేసయ్యతో సహవాసం చేస్తూ, ఆ దేవుని మాటలు వినటం , నేర్చుకోవటం నిజంగానే ధన్యత.

నా యేసయ్య గురించి వాక్యలో ఇలా వ్రాయబడి ఉంది.
యెషయా గ్రంథము 11:2
“యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని (యేసు) మీద నిలుచును”అని

* మరి నేర్చుకొనుటకు యేసయ్య ముందు మనం కూర్చుంటే. .
అయన తన పరిశుధాత్మతో
– మనకి జ్ఞానాని దయచేస్తారు.
– మనకి వివేకము అనుగ్రహిస్తారు.
– మనకి ఆలోచన చెప్తారు.
– మనకి బలమును ప్రసాదిస్తారు.
– మనకి తెలివిని ఇస్తారు.
– మనకి యెహోవాయెడల భయమును,
భక్తిని నేర్పుతారు.

నా ప్రియ స్నేహితులారా…. ఇప్పుడే ఇలా ప్రార్దించండి.
“యేసయ్యా. . . .ఎవని వద్దకు వేళ్ళుదుము నీవే నిత్యజీవపు మాటలు గల వాడవు; నీవే దేవుని పరిశుధ్ధుడవని మేము విశ్వసించియున్నము”

హల్లెలూయ…
మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!

 
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article