కుంభమేళా కోసం జియో కొత్త ఫోన్

JIO Introduces new phone for Kumbamela

· అవసరమైన వివరాలతో ఆవిష్కరణ

టెలికాం రంగంలో సంచలనాలతో సాగిపోతున్న జియో మరో కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. అలహాబాద్ లో జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న కుంభమేళా కోసం కొత్తగా జియో ఫోన్ ఆవిష్కరించింది. ప్రపంచ అతిపెద్ద ఉత్సవానికి హాజరయ్యే దాదాపు 130 మిలియన్ల మందికి పైగా భక్తులకు అన్ని రకాలుగా సేవలు అందించేలా ఈ ఫోన్ రూపొందించింది. కుంభ మేళాకు సంబంధించిన ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు, ప్రభుత్వ సంబంధిత సేవలు వంటి వివిధ సమాచారాన్ని ఇందులో పొందుపరచింది. 1991 హెల్ప్ లైన్ ద్వారా సహాయంతోపాటు, ఉచిత వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌ సేవలను అందించనుంది. మేళాలో కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్‌’ పేరుతో ఒక యాప్‌ను కూడా తీసుకొచ్చింది. తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్‌ ఐటీ సంస్థ సహకారంతో ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు జియో తెలిపింది. ఈ సదుపాయాలను జియో పాత, కొత్త కస్టమర్లు వినియోగించుకోవచ్చు. ఈ కుంభ్‌ జియో ఫోన్‌ ద్వారా కుంభమేళాకు సంబంధించి ముఖ్యమైన వార్తల సమాచారం, ప్రకటనలు పొందవచ్చు. కుంభ్‌ రేడియో ద్వారా భజనలు, ఇతరభక్తి సంగీతాన్ని వినే అవకాశాన్ని కూడా కల్పించింది. కుంభమేళా ప్రదేశం రూట్‌మ్యాప్‌తో పాటు బస్సు, రైల్వే స్టేషన్ సమీపంలోని వసతి సదుపాయాలు , ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఇంకా పూజలు, పవిత్ర స్నానాలకు సంబంధిత సమాచారాన్ని కూడా ఎప్పటికపుడు అందిస్తుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article