జియో యూజర్లకు బంపర్ ఆఫర్

Spread the love

JIO PRIME EXTENDED

  • ప్రైమ్ సభ్యత్వం మరో ఏడాదిపాటు ఉచితం
  • ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుందని వెల్లడి

ఐపీఎల్ లో తమ జట్టు విజయం సాధించిందనే ఆనందమో ఏమో.. టెలికాం సంచలనం జియో తన యూజర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుత ప్రైమ్ కస్టమర్లకు ఆ ప్రయోజనాలను ఉచితంగా మరో ఏడాదిపాటు పొడిగించింది. అంటే ప్రైమ్ సభ్యత్వం మరో ఏడాదిపాటు ఉచితంగా పొందొవచ్చన్న మాట. ఈ సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్ గా రెన్యువల్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. టెలికాం రంగంలోకి జియో రాకతో ఎన్నో సంచలనాలు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఖరీదైన డేటా ఏకంగా ఉచితంగానే లభించింది. అపరిమితంగా వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ లు, డేటా.. ఇలా ఎన్నో ప్రయోజనాలను చాలాకాలం పాటు ఉచితంగానే అందజేసింది. అనంతరం జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకునేవారికి ఈ అవకాశాలు అని కంపెనీ ప్రకటించింది. రూ.99 చెల్లించి ప్రైమ్ సభ్యత్వం పొందితే ఏడాదిపాటు అన్నీ ఉచితమేనని పేర్కొంది. రెండు సార్లు దీనిని పొడిగించింది. తాజాగా ఆ గడువు ముగుస్తుండటంతో మరోసారి ఉచితంగానే దీనిని రెన్యువల్ చేస్తోంది. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా ప్రస్తుతం ఉన్న ప్రైమ్ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ స్పష్టంచేసింది. దీంతో ప్రైమ్ సభ్యత్వం ఉన్న జియో యూజర్లు.. ఏడాదిపాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ వంటి సేవలన్నంటినీ ఉచితంగానే పొందొచ్చు. యూజర్లు తమ ప్రైమ్ మెంబర్ షిప్ ఆటో రెన్యువల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్‌లోకి వెళ్లి మై ప్లాన్స్ సెక్షన్‌లో చూస్తే తెలుస్తుంది. మీ ప్లాన్‌ ఆటోమేటిగా అప్‌డేట్‌ అయితే.. జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్ యాక్టివేట్‌ అయిందనే సందేశం కనిపిస్తుంది.

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *