ఘనంగా తారక్ జన్మదిన వేడుకలు

నూజివీడు : నూజివీడు మండలం తుక్కులూరు జెబిఎల్ హోమ్ లో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. మాజీ ఏఎంసీ చైర్మన్, రావిచర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రావిచర్ల శాలివాహన సంఘం యూత్ సభ్యులతో తుక్కులూరు జేబీఎల్ హోమ్ లోని వృద్ధులతో కలిసి ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ ను కట్ చేసి, వృద్ధులకు అల్పాహారాన్ని అందజేసి జూనియర్ ఎన్టీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని దీవించారు. ఈ సందర్బంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వైసిపి అరాచకాలను అంతమొందించాలంటే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ సేవలు అవసరమన్నారు. నందమూరి తారకరామారావు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని, ఆయన ఆశయాలను బ్రతికించాలంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి అండగా ఉండి వైసిపి రాక్షస పాలన నుండి రాష్ట్ర ప్రజలను కాపాడాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా వైసిపి అరాచక పాలనను అంతమొందించడానికి ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలనను అందించాలని ఆకాంక్షించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article