JR Ntr Waiting for this situation
యంగ్ టైగర్ ఇంతకు ఏ రోజు ఎదురుచూస్తున్నాడో తెలుసా! అఖిల్ చాలా గొప్ప నటుడు అని అందరూ మెచ్చుకునే రోజు త్వరలోనే వస్తుందని.. ఆరోజు కోసం అక్కినేని అభిమానులతో పాటు తాను కూడా ఎదురు చూస్తున్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఇదే వేదికపై నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గురించి చెబుతూ వ్యామోహం తప్ప.. వ్యాపారం తెలియని నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ పదికాలాల పాటు చల్లగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తనకు నటుడిగా పరిచయమని, తర్వాత రైటర్, తర్వాత దర్శకత్వం చేయబోతున్నానంటూ తనకు చెబితే తనలో చిన్న కన్‌ఫ్యూజన్ కనపడింది. వెంకీ నాకు చాలా మంచి స్నేహితుడు. తను ఏమౌతాడోనని చిన్న భయం ఉండేది. కానీ తొలిప్రేమ చూసిన తర్వాత ఇక తన గురించి భయపడాల్సిన పనిలేదని అర్థమైందంటూ ఎన్టీఆర్ తెలిపారు.