తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు

62

తెలంగాణ న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గౌరవ కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో సంప్రదించి, తెలంగాణ హైకోర్టులో గౌరవ న్యాయమూర్తుల పోస్టుల సంఖ్యను 24 నుండి 42 కి పెంచాలన్న చిరకాల డిమాండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రిగా.. నేను గతంలో అనేకసార్లు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రతిపాదనలు చేశాను. ఈ రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి.. నా సమక్షంలో ఫైలును ఆమోదించారు. ఇందుకుగాను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. న్యాయమూర్తుల సంఖ్య పెరగడంతో.. న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంలో తెలంగాణ హైకోర్టు ఖచ్చితంగా దేశానికి స్ఫూర్తిదాయకం అవుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here