అభిమానులు ఎన్టీఆర్ సినిమా ఆరంభం కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు.సినిమా మొదలు కాకపోతుందా.ఏదో ఒక కొత్త అప్‌డేట్ రాకపోతుందా అనేది అభిమానుల ఆశ. `ఆర్.ఆర్.ఆర్` తర్వాత అందులో నటించిన మర కథానాయకుడు రామ్‌చరణ్ ఒక పక్క ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ మరో కొత్త సినిమాని ప్రకటించారు. ఇలా చరణ్ సినిమాల వెంట సినిమాలు ప్రకటిస్తుంటే, ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు ప్రకటించి కూడా చాలారోజులైంది. పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో చిత్రం ఆలస్యమవుతూ వచ్చింది. దాంతో అప్‌డేట్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పదే పదే అడగడం, ఆ విషయం గురించి మీమ్స్ కూడా రావడంతో ఎన్టీఆర్ ఈమధ్య జరిగిన `అమిగోస్` ఫంక్షన్‌లో గుస్సా అయ్యారు. ఏదెలా ఉన్నా ఎట్టకేలకి ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది.
ఈనెల చివరి వారంలో సినిమాని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చిలో చిత్రీకరణ మొదలు పెడతారు. `ఆర్.ఆర్.ఆర్` తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో అందుకు దీటుగా ఉండాలని ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తను అనుకున్నట్టుగా స్క్రిప్ట్ రావాల్సిందే అని పట్టుబడుతున్నారు. అందుకే ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది. ఫైనల్లీ ఈ షురూ అవుతోంది.