ఏపీ హైకోర్టు ఏర్పాటుపై జస్టిస్ చలమేశ్వర్ సంచలనం

Justice Chalemeswar Sensational Comments AP high Court

ఏపీలో ఇటీవల ఏర్పాటు చేసిన హైకోర్టు నిబంధనలకు విరుద్ధంగా సాగిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏర్పాటు ఏ మాత్రం సరికాదంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు చేసిన విధానం రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న ఆయన.. ఫిబ్రవరి 3న ఏపీలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయే తేల్చుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు.చలమేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు ప్రాంగణ ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
న్యాయశాస్త్రం మీద.. రాజ్యాంగ అంశాల మీద మంచి పట్టున్న చలమేశ్వర్ లాంటి వారు.. రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్యలు చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీస్తుందని చెప్పక తప్పదు.ఇంతకీ జస్టిస్ చలమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి? ఏపీ హైకోర్టు ఏర్పాటులో నిబంధనలు ఎలా ఉల్లంఘనకు గురయ్యాయి? ఎక్కడ తప్పు దొర్లింది? ఆయన ఎందుకింత అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారన్న అంశాల్ని ఆయన మాటల్లోనే చెబితే..
పార్లమెంట్ ను తోసిరాజని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా హైకోర్టును ఏర్పాటు చేయడం ఘోరమైన రాజ్యాంగ ఉల్లంఘన. అందుకే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక వల్ల ఈ లోపాలు సమసిపోతాయో లేదో జస్టిస్ గొగోయ్ తేల్చుకోవాలి. వాస్తవానికి 2019 జనవరి 1వ తేదీ నుంచీ కొత్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటవుతుందని పేర్కొంటూ గత ఏడాది డిసెంబరు 26న రాష్ట్రపతి నోటిఫికేషన్ తో గజిట్ విడుదలైంది. కానీ.. ఇది సరైన విధానం కాదు. తాత్కాలిక హైకోర్టు భవనం పూర్తి కాకపోవడంతో విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రస్తుతం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ చెప్పిన తర్వాతే కొత్త హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫై చేయ్యాల్సి ఉంటుంది. హైకోర్టుల ఏర్పాటుపై అనుసరించాల్సిన విధానం గురించి రాజ్యాంగంలో వివరించారు. కానీ ఈ విషయంలో పార్లమెంట్ ను పూర్తిగా దాటవేశారు. పార్లమెంట్ ఒక తేదీని నిర్ధేశించి రాష్ట్రపతి దగ్గరకు ఒక బృందాన్ని పంపుతుంది. గతంలో ఇలాగే జరిగింది. గతంలో హైకోర్టుల ఏర్పాటు విషయంలో ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం వెళ్లారు. ఒక తేదీని – ప్రదేశాన్ని నిర్ణయించేవారు. బిహార్ – మధ్యప్రదేశ్ రాష్ట్రాల పునర్విభజన చట్టాలలో హైకోర్టు ఏర్పాటుపై అపాయింటెడ్ తేదీని పేర్కొన్నారు. కానీ ఇప్పుడలా లేదు. దేశంలోని ప్రతీ రాజ్యాంగ వ్యవస్థ ఇలా తయారైతే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఆ దేవుడే మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

Check Out Latest Offers in Amazon

For more Political New

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article