జస్టిస్ కేశవరావు మృతి

108
Justice Keshavarao died
Justice Keshavarao died

జస్టిస్ కేశవరావు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఆయన మృత‌దేహాన్ని హ‌బ్సిగూడ‌లోని ఇంట్లో రెండు గంట‌ల వ‌ర‌కూ ఉంచుతారు. త‌ర్వాత మూడు గంట‌ల‌కు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్థానంలో అంతిమ సంస్కారాల్ని నిర్వ‌హిస్తారు. ఆయ‌న మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సిఎస్ సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

  • న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సిఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జస్టిస్ కేశవరావు మృతి న్యాయ వ్యవస్థ కు, అణగారిన వర్గాలకు తీరని లోటు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల నుంచి కేశవరావు తనకు ఆప్తుడు అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here