ఎన్కౌంటర్ పై సుప్రీం జస్టిస్ ఏమన్నాడంటే…

Justice Should Not Be Revenge

దేశ వ్యాప్తంగా దిశ అత్యాచారం, హత్య చేసిన నిందితుల ఎన్కౌంటర్ ప్రకంపనలు రేపుతుంది. ఇక తాజాగా సత్వర న్యాయం అందించాలి అని డిమాండ్ వినిపిస్తున్న తరుణంలో అది సాధ్యమేనా అన్న చర్చ జరుగుతుంది. దేశంలో మహిళలపై అత్యాచారాలు, హింస తదితర నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే స్పందించారు. సత్వర న్యాయం రూపేణ జరుగుతున్న ఎన్ కౌంటర్లపై బాబ్డే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. న్యాయమనేది ప్రతీకారంగా మారితే అది తన లక్షణం కోల్పోతుందని పేర్కొన్నారు. సత్వర న్యాయం సాధ్యం కాదన్నారు. నేరానికి వెంటనే శిక్ష విధిస్తే న్యాయానికి అర్ధముండదని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు.

రాజస్థాన్ లోని జోద్ పూర్ లో హైకోర్టు భవనం ప్రారంభోత్సవంలో బాబ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేప్ కేసుల్లో సత్వర తీర్పులు చెప్పాలన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలతో సీజేఐ విభేదించారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ఆవశ్యకత కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యాయం అనేది ప్రతీకారంగా మారకూడదని చెప్పారు. నిందితుడు నేరం చేశాడన్నది నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్న నేపథ్యంలో బాబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం నిందితులకు కూడా కొన్ని హక్కులుంటాయని ఆయన అన్నారు.

Justice Should Not Be Revenge#DishaMurder, #AccusedEncounter, #SupreemCourt, #ChiefJustice #S.A.Bobde, #RapeIncidents, #InstantJustice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *