తెలంగాణ వచ్చాకే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం

JUSTICE TO SC, ST IN TELANGANA

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలోని కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, విద్యాసాగర్, సుంకపాక దేవయ్య, శ్రీమతి నీలాదేవి, చిల్కమర్రి నరసింహ్మ తదితర బృందం ఈ రోజు గురువారం వికారాబాద్ జిల్లా నిఘా వ్యవహారాల మరియు పర్యవేక్షణ సమితి సమావేశానికి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే  మెతుకు అనంద్, జిల్లా కలెక్టర్‌  మస్రత్‌ ఖానం అయేషా, జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ కుమారి, జిల్లా ఎస్పీ ఎం. నారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మిలతో సహా పోలీసు , రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ” ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవాలి. ఆ రోజున ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాల గురించి అందరికి వివరించాలి.

అట్రాసిటీ చట్టాలు ఒక్క ఎస్సీ, ఎస్టీలకు తెలిస్తేనే సరిపోదు. అన్ని వర్గాల ప్రజలకు తేలియాలి. అప్పుడే ఎస్సీ, ఎస్టీలపై దాడులు తగ్గుతాయి. రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఈ సివిల్ రైట్స్ డే నిర్వహించుకోని.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహాన కల్పిస్తున్నారు. అందుకే ఆయా ఆయా నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్సీ,ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం జరగాలనే లక్ష్యంతో కమిషన్ ను ఏర్పాటు చేసి ఐదుగురు సభ్యులతో కూడిన కమిషన్ ను ఏర్పాటు చేశారు. కమిషన్ ఏర్పాటు చేసిన మొదటి రోజు నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాము. కమిషన్ దృష్టికి ఆరు వేలకుపైగా కేసులు వస్తే అందులో 5,975కేసుల్లో సత్వర న్యాయం జరిగింది. సుమారు నలబై మూడు కోట్ల రూపాయలు బాధితులకు పరిహారం అందింది”అని అన్నారు. అందుకే ప్రతి నెల సివిల్ రైట్స్ డే ను నిర్వహించుకుని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అందరికీ అవగాహాన కల్పించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల సూచించారు.

telangana live updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *