కేఏ పాల్ సంచలనం .. 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తా

KA Paul sensational Comments – Ill Clean Sweep in 175 Places

వినేటోడు వెర్రోడైతే చెప్పేటోడు కె.ఎ.పాల్ అవుతాడు. ఆలు లేదు చూలు లేదు పేరు సోమలింగం అన్నట్లు అసలు పార్టీకి క్యాడర్ ఏ లేదు. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు లేరు కానీ పాల్ ఏపీలోని 175 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తారట. ఇక చంద్రబాబు, జగన్ కె ఏ పాల్ తో చర్చలకు వెళ్లాలట.. రాజకీయాల్లోకి తను కొత్తగా రాలేదని 2009లోనే రాజకీయఆరంగేట్రం చేసానని చెప్తున్న కే ఏ పాల్ మొత్తానికి 175 సీట్లు సాధిస్తామని షాకింగ్ కామెంట్ చేశారు. దీంతో తెల్ల పోవడం ఏపీ ప్రజల వంతయింది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ విరుచుకుపడ్డారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న లక్ష కోట్లు ఇస్తే… ఏపీ కష్టాలు తీరతాయని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జగన్‌ తనతో చర్చకు రావాలని అన్నారు. 2009 లోనే తాను రాజకీయం రంగ ప్రవేశం చేశానని.. కొత్తగా మొదలు పెట్టలేదన్నారు. అలాగే ఏపీలో ప్రజాశాంతి పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసినా ఆశ్చర్యంపోనక్కర్లేదన్నారు. ఎన్నికలకు మరో 90 రోజులు సమయం ఉందని.. ఇప్పటికే 100 సీట్లలో తమకు గెలుపు ఖాయమైందన్నారు. గట్టిగా కృషి చేస్తే.. 175కి ఏపీలో 175 సీట్లు సాధిస్తామని కూడా చెప్పారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన శిష్యుడని, మిత్రుడని కేఏ పాల్ సరదాగా వ్యాఖ్యానించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article