కబడ్డీకి బంగారు భవిష్యత్

77
KABADDI HAS BRIGHT FUTURE
KABADDI HAS BRIGHT FUTURE

KABADDI HAS BRIGHT FUTURE

కబడ్డీ ఆడాలి అంటే కఠోర శ్రమ అవసరమని, కబడ్డీకి భవిష్యత్ లేదు అన్నది పూర్తిగా అవాస్తవమని భారత కబడ్డీ మాజీ కెప్టెన్ అజయ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఏషియన్ గేమ్స్ ఎంపికలో నైపుణ్యమే ప్రామాణికమని, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం తప్పక ఉంటుందని ఆయన వెల్లడించారు. పిల్లల అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వగలిగినప్పుడే వారు ఆయా రంగాలలో రాణిస్తారని అందుకు భిన్నంగా ఉంటె ఫలితాలు మరోలా ఉంటాయన్నారు. పాఠశాలలలో క్రీడలకు ప్రోత్సహం కలిపిస్తే దేశం అద్భుతమైన క్రీడాకారులను సృష్టిస్తోందని,అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలలో కబడ్డీ ఆటను దృష్టిలో పెట్టుకుని క్లబ్ లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ను ఆయన గుర్తుచేశారు. అటువంటప్పుడే పిల్లల్లో శారీరిక దృఢత్వం తో పాటు మానసిక రుగ్మతలను రూపు మాప గలుగుతామన్నారు.

  • ఏ ఆటకుండే ప్రాధాన్యత దానికి ఉంటుందని అయితే క్రికెట్ తో సమానంగా కబడ్డీ ని ఆదరించేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటివరకు భారతదేశం రెండు మార్లు ప్రపంచకప్ తో పాటు గోల్డెమెడల్స్ సాధించడం తో పాటు 7 సార్లు జరిగిన ఏషియన్ గేమ్స్ లోనూ బంగారు పతకాలు సాధించిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం బాలురలలో హర్యానా,బాలికలలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మంచి నైపుణ్యతను ప్రదర్శిస్తున్నాయాన్నారు.కబడ్డీలో మెళుకవలు తెలుసుకోవడంలొనే ఆట అనుకూలంగా మారుతుందన్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం (SAI)మంచి ప్రతిభ కనపరుస్తుందన్నారు.
    రైజింగ్ లో పాల్గొనాలని తన తండ్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని,ఆయన కోరిక మేరకు నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు ప్రపంచ కప్ సాధించి తండ్రి కల సాకారం చేశానన్న తృప్తి తనకుమిగిలిందన్నారు.జాతీయ కబడ్డీ పోటీలు మొట్టమొదటి సారిగా గ్రామీణ ప్రాంతాంలో నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. ఇక్కడ ఏర్పాట్లు అద్బుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఇటువంటి ఏర్పాట్లు పట్టణ ప్రాంతాలలో జరిగినప్పుడు కూడా తాను చూడలేదని గ్రామీణ ప్రాంతంలో అదీ రాత్రి పూట జరుగుతున్న పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఎక్కడ కూడా రాత్రి అన్న భావన కలుగ కుండా చేయడం అభినందనీయమన్నారు.అందుకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.

 

#INDIAN KABADDI UPATES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here