కడియం శ్రీహరి కాళేశ్వరం సందర్శన .

167
Kadiyam Sri Visit to Kaleshwaram
Kadiyam Sri Visit to Kaleshwaram

Kadiam Sree Visit to Kaleswaram

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టు లేక , కీలక పదవి లేక తన ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని విలవిలలాడుతున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి మరో మారు తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు అన్న వార్తల నేపథ్యంలో కడియం శ్రీహరి తన ఉనికిని, కెసిఆర్ పట్ల ఉన్న స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పేరుతో కార్యక్రమం చేపట్టారు. సెప్టెంబర్ 4న చలో కాళేశ్వరం అంటూ ప్రాజెక్టు సందర్శన చేయనున్నారు. గోదావరి నీటిని ఒడిసి పట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసిన అద్భుత నిర్మాణం అని , సీఎం కేసీఆర్ గారి కల సాకారమైన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కదలిరండి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు.

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు అన్న వార్తల నేపథ్యంలో కడియం శ్రీహరి తన ఉనికిని, కెసిఆర్ పట్ల ఉన్న స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పేరుతో కార్యక్రమం చేపట్టారు. సెప్టెంబర్ 4న చలో కాళేశ్వరం అంటూ ప్రాజెక్టు సందర్శన చేయనున్నారు. గోదావరి నీటిని ఒడిసి పట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసిన అద్భుత నిర్మాణం అని , సీఎం కేసీఆర్ గారి కల సాకారమైన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కదలిరండి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరధుడు అని ఆయన చేసిన ప్రయత్నాన్ని చూడాలని, అన్నదాతలకు నీటి కొరత తీర్చి ఆపన్నహస్తం కాళేశ్వరం అని కాళేశ్వరం సందర్శనకు అందరూ రావాలని కార్యక్రమాన్ని చేపట్టారు కడియం శ్రీహరి. అయితే ఇంతకాలం అన్ని కార్యక్రమాల్లోనూ అంటి ముట్టనట్టు గా వ్యవహరించిన కడియం శ్రీహరి, ఆయనే సొంతంగా కార్యక్రమం చేపట్టి కెసిఆర్ దృష్టిలో పడాలని ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో కడియం శ్రీహరి చేస్తున్న ఈ ప్రయత్నం వెనక మతలబు అదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here