దేవుళ్లని పూజించడం కాదు- వాళ్లలా అవతారం ఎత్తాల్సిందే

Kailash Satyarthi Reacts On disha accused encounter

చెడుపై ఎప్పుడూ మంచిదే విజయం. దుష్ట సంహారానికి భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తుతూనే ఉంటాడు. రాముడు, కృష్ణుడు అవతరాలు అందుకే జరిగాయ్‌. మరి ​కలియుగంలో దేవుడు ఇలా అవతరాలు ఎత్తుతాడా అంటే ఏమో… అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే అలాంటి అద్భుతాలకు అవకాశం ఉందేమో అనిపిస్తోంది దిశ ​కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత- బాలల హక్కుల కార్యకర్త కైలాష్‌ సత్యార్థి కూడా ఇలాంటి ​అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. త్రేతాయుగంలో రావణుడు, ద్వాపర యుగంలో దుశ్శాసనుడు మన ఆడబిడ్డలను కేవలం ఎత్తుకెళ్లారు. కానీ కలియుగంలో రాక్షసులు మన ​సీతలను, ద్రౌపదులను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారాలు చేసి తగలబెడుతున్నారు. అలాంటప్పుడు రాముడు, కృష్ణుడిలా మారకుండా ఎంతకాలమని వారికి పూజలు ​చేస్తూ కూర్చోవాలి అంటూ కైలాష్‌ ప్రశ్నించారు. శాంతి బహుమతి గ్రహీతే ఇంత ఆగ్రహాంగా స్పందించారంటే రోజురోజుకు ఆడవారిపై పెరిగిపోతున్న నేరాలు ఎంత ఆందోళన కలిగిస్తున్నాయో ఆలోచించాల్సిందే. ప్రభుత్వాలు చట్టాలను- శిక్షలను మరింత కఠినతరం చేయాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *