KAJAL GOING TO PRODUCE MOVIES
కాజల్ అగర్వాల్ దశాబ్దకాలంగా హీరోయిన్‌గా తనదైన నటనతో మెప్పిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ భామ ఇప్పుడు నిర్మాతగా కూడా మారుతున్నారు. వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్ చిత్రం క్వీన్‌ను తమిళంలో పారిస్ పారిస్, తెలుగులో దటీజ్ మహాలక్ష్మిగా, అలాగే కన్నడ, మలయాళంలో కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా యూరప్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం వెళ్లినప్పుడు తెలుగు వెర్షన్‌ను చిత్రీకరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో కాజల్ అగర్వాల్ సినిమా చేయడానికి ఒకే అందట. కెఎ మూవీస్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి అందులో తనే నిర్మించాలనుకుంటుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
For More Click Here
More Latest Interesting news