జూలై 7 నుండి వారం రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు

వరంగల్: జూలై 7వ తేదీ నుండి వారం రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహించనున్నామని రాష్ట్ర పర్యాటక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హనుమకొండ వరంగల్ జిల్లాలలో పర్యటనలో భాగంగా మంత్రి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ తో కలిసి కిలా వరంగల్ కోట లో పర్యటించి నాటి కాకతీయుల శిల్పాలను పరిశీలించారు. ఆనాడు కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల నే ఆదర్శంగా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెరువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, కాకతీయ కుల అదృష్ట సంఖ్య 7, ఏడు కోటలు ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయుల వైభవాన్ని మరోసారి గుర్తు చేసేందుకు వారం పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article