కాళోజీహెల్త్ యూనివర్సిటీలో పీజీ ఫస్ట్ ఇయర్ లో ఒక్కరే పాస్

kaloji health university only one guy passed in exams

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. వర్సిటీ ప్రారంభించి నాలుగున్నర ఏళ్లకుపైగా కావస్తున్నా.. కనీస స్థాయిలో పరిపాలన వ్యవహారాలు జరగడంలేదు. ఇక బోధన సైతం అంతంత మాత్రమే అని చెప్పడానికి ఇటీవల నిర్వహించిన మెడికల్ పీజీ ఫస్టియర్ ఫలితాలే ఒక తార్కాణం.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడింది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. పేరుకు యూనివర్సిటీ గా ఉన్న యూనివర్సిటీ లో ఉండాల్సిన వసతులు కానీ, పరిపాలనా వనరులు కానీ, సిబ్బంది కానీ ఇక్కడ లేరు. దీంతో వైద్య విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన మెడికల్ పీజీ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 105 మంది పీజీ విద్యార్థులకు గాను 98 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా వెలువరించిన ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ అయినట్లుగా ఫలితాలు చేయడంతో విద్యార్థులు షాక్ అయ్యారు. తాము పరీక్షలు బాగా రాశాము అని చెబుతున్న విద్యార్థులు పరీక్షల విభాగం ప్రకటించిన ఫలితాలను చూసి ఆవేదనకు గురయ్యారు.
దీంతో వరంగల్ లోని యూనివర్సిటీ ప్రధాన భవనం వద్ద పీజీ విద్యార్థులు మౌనంగా తమ నిరసనను తెలియజేశారు. ప్రశ్నా పత్రాల మూల్యాంకనం లో తప్పు జరిగిందా, లేకా ఫలితాల విడుదల సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయా .. మరి ఏ ఇతర కారణాలు ఉన్నాయి అన్నదానిపై విద్యార్థులు మల్లగుల్లాలు పడుతున్నారు.
విద్యార్థులు పరీక్షలు బాగా రాసినా ఫలితాలలో ఒక్కరంటే ఒక్కరు పాస్ కావడం ఇటు విద్యార్ధులనే కాదు, అటు యూనివర్సిటీలోని అధ్యాపకులను, తల్లిదండ్రులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది. ఒకవేళ నిజంగానే ఒక్క విద్యార్థి మాత్రమే పాస్ అయితే ఇంత మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి యూనివర్సిటీలోని బోధనా సిబ్బంది బాధ్యులు కారా అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో తలెత్తుతోంది.
లేదంటే మూల్యాంకనంలో తప్పు జరిగి వుంటుంది కాబట్టి తిరిగి పేపర్లను మూల్యాంకనం చెయ్యాలని కోరుతున్నారు

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article