అప్పుడు గుణ.. ఇప్పుడు గురు అంటోన్న కమల్

kamal guru

ఇండియాలో బెస్ట్ యాక్టర్ అంటే ఒక్కో భాషలో ఒక్కో హీరో పేరు వినిపిస్తుంది. కానీ అన్ని భాషల వారి నుంచి వచ్చే పేరు కమల్ హాసన్. ఆ రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు కాబట్టే ఏకంగా లోక నాయకుడు అంటున్నారు ఆయన్ని. ఏ పాత్రైనా పరకాయ ప్రవేశం చేయడం.. గెటప్పులతో ప్రయోగాలు చేయడం.. కాంట్రవర్శీయల్ కథలను కూడా కన్విన్సింగ్ గా చెప్పడం కమల్ స్టైల్. ఆ స్టైల్ ను అందిపుచ్చుకున్న మరో హీరో ఇంత వరకూ రాలేదంటే అతిశయోక్తి కాదు. వయసు మీద పడుతున్నా.. ఏ మాత్రం తరగని ఉత్సాహంతో దూసుకుపోతోన్న కమల్ ప్రస్తుతం భారతీయుడు -2 సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు రీసెంట్ గా ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తో సినిమా అనౌన్స్ అయింది. లోకేష్ ప్రస్తుతం తను విజయ్ తో రూపొందించిన మాస్టర్ విడుదల కోసం వేచి చూస్తున్నాడు. ఖైదీ టైమ్ లోనే లోకేష్ కు కమల్ ఆఫర్ ఇచ్చాడు. ముందు విజయ్ సినిమా కమిట్ కావడం వల్ల అదే పూర్తయింది. ఇక కమల్ వంతు వచ్చింది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు ‘ఒన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ ఘోస్ట్’అనే క్యాప్షన్ తో పూర్తిగా రెడ్డిష్ పోస్టర్ తో ఆకట్టుకున్నారు.

అయితే ఈ మూవీ టైటిల్ కూడా త్వరలోనే చెప్పబోతున్నారు. కొన్నేళ్ల క్రితం కమల్ చేసిన ఎక్స్ పర్మంటల్ మూవీ గుణ గుర్తుందా..? ప్రియతమా నీవచట కుశలమా అనే పాట ఉన్న ఈ సినిమాను మర్చిపోవడం అంత సులభం కాదు కూడా. ఆ టైటిల్ ను గుర్తు చేసేలా ఇప్పుడు ‘గురు’అనే టైటిల్ తో రావాలనుకుంటున్నారట. నిజానికి ఇది మంచి టైటిల్. పైగా ఏ భాషలో డబ్ అయినా టైటిల్ తో గొడవేం ఉండదు. ఇది ‘నౌన్’లేదా ఆబ్జెక్టివ్ కాబట్టి ఎక్కడా ప్రాబ్లమ్ రాదు. అందుకే ఈ టైటిల్ నే ఫిక్స్ చేయాలనుకుంటున్నారట. విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ వచ్చే యేడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభం కావొచ్చు అంటున్నారు. లోకేష్- విజయ్ కాంబోలో రూపొందిన మాస్టర్ సమ్మర్ లోనే విడుదల కావాల్సి ఉంది. కరోనాతో ఆగిపోయింది. అన్నీ కుదిరితే వచ్చే దీపావళి లేదా సంక్రాంతికి రావొచ్చు. ఒకవేళ ఈ సినిమా కూడా ఖైదీ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే కమల్ హాసన్ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతాయి.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *