Kamal Hassan as Sanapathi In Indian 2 movie
వయసు మళ్లిన స్వాతంత్ర్య పోరాట యోధుడు.. ఎంతో కష్టపడి సాధించిన స్వాతంత్య్రం లంచగొండుల చేతిలో పడి నాశనం అవుతుంటే చూడలేక.. అవినీతి నిర్మూలనకు నడుం కడతాడు. వయసు అయిపోయిన వాడు కదా.. ఏం చేస్తాడనుకుంటే పొరపాటే!. సేనాపతిగా పిలవబడ్డ ఆయన మర్మకళలో సిద్ధహస్తుడు. లంచగొండి అధికారులను చంపే క్రమంలో తన కడుపులో పుట్టిన కన్న కొడుకు కూడా లంచగొండి అని.. తన కారణంగా నలబై మంది పిల్లలు చనిపోయారని తెలుసుకుని కన్నకొడుకుని కూడా చంపేస్తాడు. అదే `ఇండియన్` సినిమా. 1996లో కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లో విడుదల అయిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ జోడి తెరపై సందడి చేయనుంది. ఇండియన్ సీక్వెల్‌గా `ఇండియన్ 2` ఈ నెల 18 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకు సంబంధించిన సేనాపతి మర్మకళ స్టైల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.