KAMAL Hassan INDIAN 2 movie was stopped
కమల్‌హాసన్, తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో 1996లో రూపొందిన చిత్రం `ఇండియన్`. దీనికి సీక్వల్‌గా ఇండియన్ 2 షూటింగ్ ఇటీవల భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. సినిమా అవుట్ పట్ట డైరెక్టర్ శంకర్ అసంతృప్తిగా అనిపించడంతో ఈసారి సెట్స్‌ను చేంజ్ చేయాలనుకుంటున్నాడట. అందుకని తాత్కాలికంగా చిత్రీకరణను వాయిదా వేశాడట. సెట్స్ అంతా ఓకే అయిన తర్వాత మళ్లీ సినిమాను రీషూట్ కూడా చేసే అవకాశాలున్నాయనేదే సమాచారం. లంచగొండితనంపై పోరాటం చేసిన భారతీయుడు దాదాపు 23 ఏళ్ల తర్వాత దేనిపై పోరాటం చేయబోతున్నాడో చూడాలి.